Tuesday, November 26, 2024

ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు : ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి

తిరుపతి సిటీ : వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో అర్హుల ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి అన్నారు.. సోమవారం గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దాసరి మఠం. గాంధీ పురం.. నందు ఇంటింటికి వెళ్లి ప్రజా సంక్షేమ లబ్ధిని వివరించారు.. యువకులు గాంధీ పురం వద్ద బహిరంగ ప్రాంతాల్లో మద్యం సేవిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి స్థానికులు తీసుకురావడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.. దోమలు విపరీతంగా ఉన్నాయని కాలువలు పరిశుభ్రంగా ఎత్తటం లేదని ఎమ్మెల్యే కి విన్నవించారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చాలా గొప్పగా జరుగుతున్నదన్నారు. ఈ వీధికి వెళ్ళిన ఏ గడపకి వెళ్లిన జగనన్న జగనన్న అంటూ జగన్ నామ స్మరణతో మారుమోగుతున్న రు.. తిరుపతి కోపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో మేమే గెలిచే వాళ్ళమంటూ బీరాలు పలుకుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఓసారి గడపగడపకు కార్యక్రమాన్ని వస్తే వైఎస్ఆర్ సీపీకి ప్రజలు ఏ స్థాయిలో బ్రహ్మరథం పడుతున్నారో అర్థం అవుతుందన్నారు.. గతంలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశామని మళ్లీ వేస్తే మహా పాపం చేసిన వాళ్ళు అవుతామని వారు స్పష్టం చేస్తున్నారు… జగనన్న ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో మా వాలంటీర్ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో చెప్పేందుకు ఉదయం ఆరు గంటల నుంచి నూతన పెన్షన్ అర్హులైన వారికి ఇంటింటికి అందజేస్తున్న రు.. ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ డాక్టర్ శిరీష. కార్పొరేటర్ తాళ్లూరు రత్నకుమారి. కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు. టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు మబ్బు నాదముని రెడ్డి. నాగిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement