తిరుపతి సిటీ : మూడేళ్లలో గడపగడపకు సంక్షేమ పథకాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఓబులేసు కాలనీలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్థానిక సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఏ ఒక్కరూ అదైర్యపడాల్సిన అవసరం లేదని ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతో పాటు కొత్తగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకుని పరిష్కరించడానికి గడప గడపకు వస్తున్నామని అన్నారు. అర్హత ఉండి సాంకేతిక కారణాలతో ప్రభుత్వ పథకాలు అందని వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధితో ఆర్థిక భరోసా కలిగిందని తెలియజేశారు. గత మూడేళ్లులో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించి కరపత్రాలను పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ. కార్పొరేటర్లు కోటూరు ఆంజనేయులు. రామస్వామి వెంకటేశ్వర్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్లూరు ప్రసాద్. ఉద్యోగులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement