Tuesday, November 26, 2024

కుప్పంలో దొంగ ఓట్ల తొలగింపునకు సహకరిస్తాం.. మరి పుంగనూరు సంగతేంది: టీడీపీ

కుప్పం, (ప్రభ న్యూస్ ): ఏపీలోని కుప్పం నియోజకవర్గంలో నకిలీ ఓట్ల తొలగింపునకు తాము సహకరిస్తామని టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ తెలిపారు. ఇవ్వాల (సోమవారం) విలేకరులతో మాట్లాడుతూ ఓట్ల వెరిఫికేషన్ లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షల ఓట్లు ఇంటి నెంబర్ లేకుండా బయట పడ్డాయన్నారు. ఇందులో ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో ఎన్నికల సంఘం నిజానిజాలు నిగ్గుతేల్చలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఒక్క పుంగనూరులో మాత్రమే రెండు వేలకు పైగా ఇంటి నెంబర్లు లేకుండా ఓటర్లు నమోదయయ్యిని శ్రీకాంత్​ తెలిపారు.ఈ విషయంపై రాష్ట్ర, కేంద్ర ఎన్నికల అధికారులకు పిర్యాదు చేస్తామన్నారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుప్పంలో మాట్లాడుతూ 25వేలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని అంటున్నారని, ఇప్పుడు పుంగనూరులో బయటపడ్డ వాటికీ ఏం సమాధానం చెప్తారని శ్రీకాంత్​ మండిపడ్డారు. కుప్పంలో దొంగ ఓట్లు ఉంటే తీసేయండి, దానికి తాము సహకరిస్తాం. టీడీపీ తరుపున ఇప్పటికే 12 వేలకు పైగా చనిపోయినవారి , బయట స్థిరపడ్డ వారి వివరాలు ఇచ్చామని చెప్పారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుపతిలో జరిగిన దొంగ ఓట్ల బాగోతంలో ఆధికారులు సస్పెండ్ అయ్యారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికారులు ఓటర్లను అన్యాయంగా , అక్రమముగా తీసేస్తే చట్టపరంగా ,న్యాయపరంగం కేసులు వేస్తామని అన్నారు.

- Advertisement -

అదేవిధంగా వలంటీర్ పేరుతో కార్యకర్తలు ఓటర్ వెరిఫికేషన్ కి వెళ్తున్నారని, బియల్ వోలతో పాటు వలంటీర్ లు వెళ్తే ప్రయివేటు కేసులు వేయడంతో పాటు ఎలక్షన్ కమిషన్ కి పిర్యాదు చేస్తామని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో సుమారు10 వేల దొంగ ఓట్లు ఉన్నాయని కుప్పంలో ఉన్న పెద్దిరెడ్డి దీనిపై సమాధానం చెప్పాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement