Saturday, November 23, 2024

ఏసీబీకి చిక్కిన వీఆర్‌వో..

కుప్పం, మే 17 (ప్రభ న్యూస్) : రైతు తన భూములను బిడ్డలకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగా.. వాటికి సంబంధించి రైతు వారి పాసు పుస్తకాలు మూటేషన్ చేసి ఇవ్వాలని గ్రామ వీఆర్ వోను సంప్రదించాడు. దీంతో ఒక్కొక్క పాసు పుస్తకానికి తొమ్మిది వేల రూపాయలు లంచం ఇవ్వాలని వీఆర్ వో డిమాండ్ చేయడంతో సదరు పాస్ పుస్తకం దరఖాస్తు దారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు దాడులు నిర్వహించి రైతు నుండి డబ్బులు తీసుకొంటున్న సమయంలో వీఆర్ వోను పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్ళితే.. కుప్పం మండలం మల్లానూరు పంచాయతీకి చెందిన కన్నప్ప తనకు చెందిన మూడున్నర ఎకరాల భూమిని తన ఐదు మంది కుమారులకు గత ఏడాది నవంబర్ లో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ భూములకు సంబందించి కన్నప్ప కుమారులు వారివారి పేరున భూములను వేరువేరుగా పాసు పుస్తకాలు చేసి ఇవ్వాలని మల్లానూరు వీఆర్ వో వెంకటేష్ ను సంప్రదించగా.. ఒక్కో పాస్ పుస్తకానికి తొమ్మిది వేలు లంచం ఇవ్వాలని కోరడంతో వారు ఏసిబి అధికారులకు సమాచారం ఇవ్వడంతో బుధవారం మల్లానూరు సచివాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి వీఆర్ వో వెంకటేష్ వద్ద డబ్బులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్ స్పెక్ట‌ర్ ఈశ్వర్ ఆధ్వర్యంలో వారి సిబ్బంది నిర్వహించడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement