Friday, November 22, 2024

వైసీపీ, టీడీపీకి ఓటు వేస్తే బిజెపి పార్టీకి వేసినట్లే.. తుల‌సిరెడ్డి…

శ్రీకాళహస్తి – తిరుపతి పార్లమెంట్ లోకసభ ఉప ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును కాంగ్రెస్ పార్టీకి వేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు తులసి రెడ్డి తెలిపారు. శనివారం ఎన్నికల ప్రచార నిమిత్తం పట్టణంలోని రాష్ట్ర పిసిసి కార్యదర్శి సీనియర్ నాయకుడు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ సముద్రాల నాయుడు అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర లోక్ సభ ఎన్నికలు సందర్భముగా ప్రజలు టిడిపికి వైసీపీకి వేసినంత మాత్రాన రాష్ట్రానికి ఏమి న్యాయం జరగదని.వైసిపి టిడిపి జనసేన మూడు పార్టీలు కేంద్రం చేతుల్లో కీలు బొమ్మగా మారాయని కావున సీనియర్ నాయకుడు మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ కు కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటు వేసినట్లయితే కేంద్రంలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి పోరాడుతారాని తెలిపారు.

ఎందుకు ఈ రాష్ట్రం మీద కేంద్రానికి ఇంత కక్ష..
నాడు విభజన సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని అలాగే ఢిల్లీ తరహాలో సచివాలయ భవనం నిర్మించి ఇవ్వడం జరుగుతుందని బిజెపి నాయకులు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాన్య ప్రజలకు నిత్యవసర వస్తువులు, ఇసుక, మద్యం, పెట్రోల్ డీజిల్ ధరలు అందుబాటులో ఉండేవని ఇప్పుడు సామాన్యులకు గుదిబండగా రేట్లు మారాయని తెలిపారు. కేవలం కేసుల గురించి భయపడుతూ రాష్ట్ర పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఈ తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 20 మంది ఎంపీ సీట్లు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు వస్తానని చెప్పిన మాట ఏమయ్యాయని ప్రశ్నించారు. సొంత చిన్నాన్న మరణించి రెండు సంవత్సరాలు అవుతున్న కోడి కత్తి కేసు లాగా నీరుగారుస్తున్నారు అని ఢిల్లీలో ఎందుకు ప్రశ్నించడం లేదని వాపోయారు మూడు సార్లు వేసిన సెట్ ల పరిస్థితి ఏమిటని ఇంట్లో హత్య చేసిన ఇంత కాలానికి న్యాయం జరగక పోవడం హంతకులను రక్షించే పని చేస్తున్నారా అని అనుమానాలు కలుగుతున్నాయని ఇంతవరకు దర్యాప్తు పూర్తి కాలేదని వాపోయారు. ఈ కేసు లో ఎంత మంది సాక్షులు మరణిస్తారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు.
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా మన్నవరం ప్రాజెక్ట్,దుగ్గి రాజపట్నం , సినిమాకు ప్రత్యేక నిధులు తీసుకురావడం జరుగుతుంది తెలిపారు. రాష్ట్రానికి ఈ నాలుగు వనరులు ఎంతో అవసరమని సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఆరుసార్లు గెలిచిన వ్యక్తి డాక్టర్ చింతామోహన్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చింతామోహన్, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement