తిరుపతి, తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలను గురువారం టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి పరిశీలించారు. దేశవాళి గోజాతుల అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
పిండ మార్పిడి విధానం ద్వారా దేశీయ గోజాతుల అభివృద్ధి కోసం నిర్దేశించిన 50 గోవులను పరిశీలించారు. అదేవిధంగా, సేంద్రియ ఎరువుల తయారీ కోసం ఏర్పాటుచేస్తున్న ప్లాంట్‌ను పరిశీలించి, ఈ ఎరువులను చక్కగా మార్కెటింగ్ చేయాలని సూచించారు. తిరుపతిలోని గోశాలలో 2,070 గోవులున్నాయని, వీటిలో 121 గోవుల నుండి పాల సేకరణ జరుగుతుందని గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ్‌రెడ్డి ఈవోకు వివరించారు. ఇవేగాక, తిరుమల గోశాలలో 30 గోవులు, పలమనేరు గోశాలలో 1,050 గోవులు ఉన్నాయని తెలియజేశారు. టిటిడి చీఫ్ ఇంజినీర్ రమేష్‌రెడ్డి, ఎస్ఇ జగదీశ్వర్‌రెడ్డి, ఎస్ఇ (ఎలక్ట్రికల్స్) వేంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎస్వీ గోశాలను పరిశీలించిన టిటిడి ఈవో
Advertisement
తాజా వార్తలు
Advertisement