తిరుపతి – బర్డ్ పాత బ్లాక్ లో చిన్న పిల్లల ఆసుపత్రి తాత్కాలిక ఏర్పాటు కోసం జరుగుతున్న పనులను టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి గురువారం పరిశీలించారు. రిషప్షన్, రిజిస్ట్రేషన్, వార్డులు, గదులు ఇతర నిర్మాణ పనులను చూశారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశిస్తూ, పలు సూచనలు చేశారు. బర్డ్ ఆసుపత్రి రోగుల కోసం కొత్తగా నిర్మించిన గదులను పరిశీలించారు. డిజైన్ తో పాటు గదులు బాగున్నాయని చెప్పారు. అనంతరం బర్డ్ కొత్త బ్లాక్ భవనాలను పరిశీలించారు. ఓపి బ్లాక్, ఫిజియోథెరపీ విభాగం చూసి పలు సూచనలు చేశారు. కొత్తగా మంజూరు చేసిన ఎక్స్ రే మిషన్లు త్వరగా తెప్పించి ఎక్స్ రే కోసం రోగులు ఎక్కువ సమయం ఎదురు చూడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోగుల సహాయార్థం హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని ఈవో ఆదేశించారు. బర్డ్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి, సి ఎస్ ఆర్ ఎం ఓ శేష శైలేంద్ర, సీఈ రమేష్ రెడ్డి, ఎస్ ఈ లు జగదీశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement