Monday, November 18, 2024

ఎన్ఐఎఫ్ఈఆర్ మెంబెర్ గా తిరుపతి ఎంపీ గురుమూర్తి

తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి): తిరుపతి లోక్సభ సభ్యుడు డాక్టర్ మద్దెల గురుమూర్తి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా స్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఎన్ ఐ ఎఫ్ ఈ ఆర్) మండలి సభ్యుడుగా ఎన్నికయ్యారు. ఎన్ ఐ ఎఫ్ ఈ ఆర్ అనేది ఔషధ శాస్త్రాలలో అధునాతన అధ్యయనాలు, పరిశోధనలకు అత్యుత్తమ కేంద్రంగా మారాలనే లక్ష్యంతో ఏర్పాటు చేయబడిన మొదటి జాతీయ స్థాయి సంస్థ. ఇది భారత ప్రభుత్వంలోని రసాయనాలు అండ్ ఎరువుల మంత్రిత్వ శాఖ, ఫార్మాస్యూటికల్స్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన స్వయంప్రతిపత్త సంస్థ.

ఈ సంస్థ దేశంలోనే కాకుండా ఆగ్నేయాసియా, దక్షిణాసియా, ఆఫ్రికా దేశాలకు కూడా ఔషధ శాస్త్రాలు, సంబంధిత రంగాలలో సహకారం అందించడానికి రూపొందించబడింది. ఈ సంస్థ కౌన్సిల్ మెంబర్ గా తిరుపతి ఎంపీ గురుమూర్తి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి స్పందిస్తూ.. తనకు అరుదైన అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ సంస్థకు మెంబర్ గా ఎన్నికవడానికి సహకారం అందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి మిదున్ రెడ్డికి, పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డికి, ఇతర సహచర సభ్యులకి తన కృతజ్ఞతలు తెలియజేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement