తిరుపతి నగర పాలక సంస్థ ఏడో డివిజన్ ఎన్నికను రద్దు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అభ్యర్థి ఫోర్జరీ సంతకంతో నామినేషన్ ఉపసంహరించారంటూ ఎస్‌ఇసికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేసిన ఎస్‌ఇసి చర్యలు తీసుకుంది. నిమ్మగడ్డ మీడియాతో మాట్లాడుతూ ఇది ఎన్నికల నేరంగా పరిగణిస్తున్నామని ప్రకటించారు. ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని, విచారణ కొనసాగాల్సిందేనని స్పష్టం చేశారు. విచారణ పూర్తయిన తర్వాత ఎన్నికల ప్రక్రియపై నిర్ణయం తీసుకుంటామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. తిరుపతి నగర పాలక సంస్థ ఏడో డివిజన్‌కు టిడిపి అభ్యర్థిగా విజయలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. అయితే తన సంతకం ఫోర్జరీ చేసి నామినేషన్ ఉపసంహరించారని ఆరోపిస్తూ ఎస్‌ఇసికి ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన ఎస్‌ఇసి ఏడో డివిజన్ ఎన్నికను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement