Tuesday, November 19, 2024

Tirupati : గత ఏడాది 42 శాతం ఉంటే ఈ ఏడాది 61% రికవరీ

సంక్రాంతి పండుగకు కోడిపందాలకు ఎలాంటి అనుమతి లేదు
తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి

తిరుపతి సిటీ : జిల్లాలో ఈ ఏడాది క్రైమ్ రేట్ 10% తగ్గిందని జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. గురువారం ప్రైవేట్ హోటల్ నందు ఏర్పాటుచేసిన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ గత ఏడాది 42 శాతం ఉంటే ఈ ఏడాది 61% రికవరీ ఉందన్నారు. గత రెండేళ్లలో జిల్లాలో నేరాలు 22% తగ్గాయి అన్నారు. శ్రీకాళహస్తి కే .ఎల్ .ఎం. పి న్ కేర్ సంస్థలో బంగారు తాకట్టు దుకాణం కేసు వేగవంతం చేయడంతో పురోగతి సాధించామని వివరించారు. ఈ ఏడాది సేబ్ . వాళ్లు 37 కేసులు నమోదు చేశారన్నారు. గంజాయి 1174 కిలోల గంజాయి ధ్వంసం చేయడం జరిగిందన్నారు. త్వరలో 3000 కిలోల గంజాయిని ధ్వంసం చేయడం జరుగుతుందన్నారు. గంజాయి విక్రియదారులు పై 16మంది పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేశామన్నారు. విశాఖపట్నం జిల్లా నుంచి గంజాయి అక్రమంగా తిరుపతి నగరంలో డంపు చేసి అమ్మకాలు సాగిస్తున్నారన్నారు. ఇక్కడి నుంచి కర్ణాటక, కేరళ, తమిళనాడుకు ,అక్రమంగా తరలిస్తున్నారు. రూ.80లక్షలు ప్రాపర్టీ నష్టపోయిన వాళ్లకు72 లక్షల రికవరీ చేశామన్నారు. అలాగే నార్త్ ఇండియా కేంద్రంగా ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతున్నాయని. 26 గ్రామాలు నాటు సారా రహిత గ్రామాలుగా ప్రకటించామన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి కోడిపందాలకు ఎలాంటి అనుమతి లేదన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతున్నది అన్నారు. డిసెంబరు 31 తేదీ నగరంలో వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా వాహనాలు తనిఖీ కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది అన్నారు మద్యం తాగి వాహనాలు నడపడమే కాకుండా ఎటువంటి ఘర్షణలు జరగకుండా నిరంతరం బ్లూ కోర్స్ రక్షక్ సిబ్బంది నిరంతరం తిరుగుతూ ఉంటారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement