తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఓట్ల లెక్కింపును తిరుపతి, నెల్లూరులోనూ చేపట్టారు. చిత్తూరు జిల్లా పరిధిలోని తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు తిరుపతిలోనూ,
నెల్లూరు జిల్లా డీకేడబ్ల్యూ కాలేజీలో సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల ఓట్లు లెక్కింపు కొనసాగుతున్నది.. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కిస్తున్నారు అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు, అభ్యర్ధులు, ఏజెంట్లుకి ముందుగానే కోవిడ్ పరీక్షలు నిర్వహించి.. కౌంటింగ్ కేంద్రంలోనికి అనుమతించారు. ఓట్ల లెక్కింపులో కరోనా ప్రభలకుండా పటిష్ఠమైన చర్యలు చేపట్టారు. కౌంటింగ్ పూర్తయ్యాక 48 గంటల పాటు ఎన్నికల కోడ్ కొనసాగనుంది. కాగా.. ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున డాక్టర్ గురుమూర్తి, టీడీపీ తరఫున పనబాక లక్ష్మి, బీజేపీ నుంచి రత్నప్రభ పోటీలో ఉన్నారు.
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
Advertisement
తాజా వార్తలు
Advertisement