Saturday, November 23, 2024

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు చేరుకుంటున్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నం సుమారు 4-6 గంట‌లోపే జ‌రుగుతుంద‌ని తెలిపారు. నిన్న స్వామివారిని 45,887 మంది భక్తులు దర్శించుకోగా 17,702 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.53 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. వికలాంగులకు, దివ్యాంగులకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జనవరి 12 నుంచి 31 వరకూ టోకెన్లు విడుదల కానున్నాయి. జనవరి 10న వసతి గృహాలకు సంబంధించిన టోకెన్లు విడుదల కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement