- అధిష్టానం ప్రసన్నం కోసం కార్పొరేటర్ల పడిగాపులు
- పంతం నెగ్గించుకునేందుకు సిగ పట్లు
- ఎంపీటీసీ ఎన్నికల తర్వాతే అంటున్న పాలకులు…!
చిత్తూరు ప్రతినిధి – చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో డిప్యూటీ మేయర్ పీఠం కోసం త్రిముఖ పోరు కొనసాగుతోంది. మైనార్టీ, రెడ్డి కాపు సామాజిక వర్గాలు కార్పొరేటర్లు వాళ్లకి మద్దతిచ్చే నేతలు సిగపట్లు పడుతూ తమ వారికి ..వారికంటూ అధిష్టానం వద్దకు పరుగులు తీస్తున్నారు. ప్రధానంగా 31 వ వార్డు కౌన్సిలర్ సయ్యద్ సర్దార్ , 5 వ వార్డు కౌన్సిలర్ హరిణి రెడ్డి, 36 వ వార్డు కౌన్సిలర్ అలీషా లకు మధ్య పోటీ నడుస్తోంది. చిత్తూరు నగరపాలక పరిధిలో 50 డివిజన్లో 46 డివిజన్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది ఆ పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు నూతనంగా ఎంపిక కాబడిన మేయర్ ,డిప్యూటీ మేయర్ పదవులతో పాలన సాగిస్తున్నారు అలాగే మరో డిప్యూటీ మేయర్ ను ప్రభుత్వం కేటాయించి పోతుండడంతో రోజుకో వ్యక్తి పేరు ఆశావహుల్లో చేరుతుంది… వరుసగా జిల్లా మంత్రివర్యులు వద్దకి అధిష్టానం వద్దకు పరుగులు తీసే సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
సయ్యద్ సర్దార్:
2008వ సంవత్సరంలో తాము పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి వైఎస్ఆర్ పార్టీలో చేరారు అప్పటి నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ పలుమార్లు పూతలపట్టు నియోజకవర్గం అసెంబ్లీ పరిశీలకులు పనిచేస్తూ అధిష్టానం నుంచి మంచి గుర్తింపును సాధించుకున్నారు అలాగే ప్రస్తుతం 31 వ వార్డు కౌన్సిలర్ గా ఏకగ్రీవంగా ఎంపిక అయ్యారు వీరికి జిల్లా మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వద్ద ప్రత్యేక గుర్తింపు ఉండటం తో డిప్యూటీ మేయర్ పీఠం కోసం పోటీ పడుతున్నారు. మైనార్టీ సామాజికవర్గానికి చెందిన ఈయన పార్టీలో సీనియర్ నాయకుడు కావడంతో ఖచ్చితంగా అధిష్టానం మొగ్గు చూపుతుందని నమ్మకంతో ఉన్నారు.
ఎస్ హెచ్ అలీషా:
36 వ వార్డు కౌన్సిలర్ గా ఏకగ్రీవంగా ఎన్నికై సత్తా చాటారు 2010 నుంచి మీడియా రంగంలో ఉత్తమ ప్రజలతో రాణిస్తూ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కి వీర విధేయుడిగా మారి రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఎదిగారు. ప్రస్తుతం వారి సూచనలతో కౌన్సిలర్ గా పోటీ చేసి ఎదురులేని గెలుపును సొంతం చేసుకున్నారు. విజయవాడలో అసెంబ్లీ మీడియా కమిటీ సభ్యుడిగా నియమితులై కొంతకాలం కొనసాగారు. ఈ క్రమంలో జిల్లా మంత్రివర్యులు వద్ద ఉన్న చొరవతో కౌన్సిలర్ పీఠాన్ని చేజిక్కించుకుని గెలుపొందారు మైనార్టీ వర్గానికి చెందిన వారు కావడంతో వీరికి డిప్యూటీ మేయర్ పీఠం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
హరిణి రెడ్డి:
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఈమె ఐదవ వార్డు కౌన్సిలర్ గా గెలుపొందారు మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి మద్దతు పూర్తిగా ఉండడంతో ఈమె డిప్యూటీ మేయర్ పీఠంపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.అలాగే ఈమె కుటుంబం నేపత్యం లో రెండు తరాలుగా ప్రజా సేవలో ఉండేవారు కావడం తో రెడ్డి సామాజిక వర్గం లో బలమైన నేతగా గుర్తింపు పొందారు. స్థానికంగా వార్డు సభ్యులకు అనుక్షణం చేదోడుగా ఉంటూ వారికి ఉన్న సమస్యలను తన సమస్యగా భావించి పరిష్కరించడంలో ముందుంటున్నారు. వీరు నిబద్ధతను గుర్తించి అధిష్టానం తమకు డిప్యూటీ మేయర్ పీఠం కేటాయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తమ వర్గానికి ఆధిపత్యం….
చిత్తూరు నగరపాలక సంస్థ లో తమ వర్గానికి ఆధిపత్యం కోసం కోసం నగరంలో మూడు వర్గాలు పోటీపడుతున్నాయి స్థానిక శాసనసభ్యులు ఆరని శ్రీనివాసులు వర్గం ఒకవైపు, మొదలియార్ సామాజిక వర్గానికి చెందిన … రాష్ట్రస్థాయిలో… అధిష్టానం వద్ద తమకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్న బుల్లెట్ సురేష్ వర్గం మరోవైపు, డిప్యూటీ మేయర్ సన్నిహితులు ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ ఆనంద్ రెడ్డి వర్గం మరోవైపు డిప్యూటీ మేయర్ పీఠం కోసం పోటీపడుతోంది. మరోవైపు ప్రస్తుతం ఎంపీటీసీ ఎన్నికలు ప్రారంభం కావడంతో ఆశావహుల ఆశలపై నీరు చల్లి నట్లయింది. అయితే అధిష్టానం ఎవరికీ పీఠం కట్ట పెడుతుందో వేచి చూడాల్సిందే.