Tuesday, November 26, 2024

కుప్పం లో మరో 25 వేల దొంగ ఓట్లున్నాయి : మంత్రి పెద్దిరెడ్డి

కుప్పం (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో ) కుప్పం నియోజకవర్గం లో ఇప్పటివరకు 12 వేల దొంగ ఓట్లు గుర్తించాంమని ఇంకా 25 వేల వరకు దొంగ ఓట్లు ఉన్నాయని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కుప్పం నియోజకవర్గం లో చేపట్టిన పర్యటన లో భాగంగా ఈ రోజు సాయంత్రం విలేకరుల సమావేశం నిర్భహించారు. ఆ సందర్బంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ కుప్పం లో 2004 ఎన్నికలలో చంద్రబాబు కు వచ్చిన 60 వేల మెజారిటీ 2019 కి వచ్చే సరికి 30 వేలకు పడిపోయిందని అంటూ ఈ సారి ఏ విధంగా కుప్పం లో లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందన్నారు.


2019 ఎన్నికలలో లో తమ పార్టీ అభ్యర్ధి ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారని పేర్కొంటూ
ఈ సారి పోటీ చేసే అయన తనయుడు భరత్ ఎం ఎల్ ఎ గా, ఎం పి గా రెడ్డెప్ప విజయం సాధించడం ఖాయమన్నారు.
కుప్పం లో వేలాదిగా దొంగ ఓట్లు చేర్చారని ఇప్పటివరకు 12 వేల దొంగ ఓట్లు గుర్తించామని, మరో 25 వేల దాకా ఉన్నట్టు తెలుస్తోందని అన్నారు. 2019 ఎన్నికలకు ముందుగా కుప్పం లో భారీగా చేర్చిన దొంగ ఓట్లను చూసిన తరువాతే రాష్ట్రంలో దొంగ ఓట్ల పై దృష్టి సారించామన్నారు.తాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దొంగ ఓట్ల పై ఫిర్యాదు చేయడం తోనే తెలిసిందనే వారు ముందుగా ఫిర్యాదులు చేస్తునట్టు ప్రచారం చేసుకుంటు న్నారని అన్నారు.కుప్పం ప్రజలు ఈ రోజు చంద్రబాబు చేస్తున్న మోసాన్ని పసిగట్టి నందుననే ఈ రోజు తాము గ్రామాలు పర్యటిస్తుంటే పెద్ద ఎత్తున అర్జీలు ఇస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement