తిరుపతి సిటీ : రామసముద్రం మండలం ఎల్లంపల్లిలో యువ రైతు అక్కుల్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం పై ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జనార్ధన్ శనివారం ఆవేదనను వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. 10ఎకరాల్లో వరుసగా పంటలు నష్టాలు రావడం, రూ.20లక్షలు అప్పుల్లో కూరుకు పోవడంతో వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోవడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. వ్యవసాయాన్ని ప్రభుత్వమే సమగ్ర పరిరక్షణ అంశంగా పరిగణనలోకి తీసుకోవాలని రైతు సంఘం అనేక సంవత్సరాలుగా ఆందోళనలు చేస్తున్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని వ్యవసాయ రంగాన్ని ఆదుకోగలరని, ఆత్మహత్యలను నివారించాలని కోరుతున్నామన్నారు. అదే విధంగా రైతులు కూడా సమస్యలపై పోరాటం చేయడం అలవరచుకోవాలి కానీ, ఆత్మహత్యలు చేసుకొని కుటుంబాలను అనాథలుగా చేయరాదన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..