Saturday, November 23, 2024

శ్రీవారిని దర్శించుకున్న హర్యానా గవర్నర్‌ దంపతులు

తిరుమల : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం ఉదయం శ్రీవారి ఆలయంలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కర్ణాటక గవర్నర్‌కు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ ఈఓ శ్రీవారి ప్రసాదం, టీటీడీ క్యాలెండర్, ఫొటో అందజేశారు.

నిన్న శ్రీవారిని 76,407 మంది భక్తులు దర్శించుకోగా 39,938 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.28 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. వారంతపు సెలవు దినాలు కావడంతో ఇవాళ అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో కిటకిటలాడు తున్నాయి. స్వామి వారి దర్శనానికి 9 గంటల సమయం పడుతుందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement