తిరుపతి : 174 సంవత్సరాల కిందట కారల్ మార్క్స్, ఎంగెల్స్ లు సంయుక్తంగా రచించి ప్రపంచ మానవాళికి అందించిన మహత్తర ఆయుధం కమ్యూనిస్టు ప్రణాళిక అని ప్రముఖ సాహితీవేత్త సాకం నాగరాజు వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టు ప్రణాళిక వెలువడి 174 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిపిఎం పార్టీ నాయకత్వంచే ప్రచురించబడిన కమ్యూనిస్టు ప్రణాళిక, కమ్యూనిజం సూత్రాలు, జయించడానికో… ప్రపంచం ఉంది, సోషలిజం.. ఊహాజనితం… శాస్త్రీయం వంటి పుస్తకాలను యశోదా నగర్ లోని సిపిఎం కార్యాలయంలో సాహితీవేత్తలు, విద్యావేత్తలు, రచయితలు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాకం నాగరాజు, సీనియర్ జర్నలిస్టు రాఘవ శర్మ, రాసాని, గోవిందు, సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజులు ఆవిష్కరణ సభలో ప్రసంగించారు.
కమ్యూనిస్టు ప్రణాళిక వెలువడి 174 సంవత్సరాలు కావస్తున్నా నేటికీ సజీవమైన అంశాలున్నాయన్నాయన్నారు. నాడు కారల్ మార్క్స్ పేర్కొన్న పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయని… దోపిడీ వ్యవస్థ రాజ్యమేలుతోందని చివరకు కార్మికవర్గం… దోపిడీ వ్యవస్థపై అంతిమ విజయం సాధించి వర్గాల రద్దుకు కారణమవుతుందన్నారు. ఫిబ్రవరి 21వ తేదీన రెడ్ బుక్ పేరుతో జిల్లావ్యాప్తంగా కమ్యూనిస్టు ప్రణాళిక ప్రాధాన్యతను వివరిస్తూ ప్రదర్శనలు, సభలు నిర్వహిస్తామని ప్రకటించారు. సమాజ మార్పును కాంక్షించే ప్రతి ఒక్కరూ తమతో భాగస్వాములు కావాలని నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు కందారపు మురళి, టి.సుబ్రమణ్యం, జయచంద్ర, సాయిలక్ష్మి, ఆర్.లక్ష్మి, వేణు, మల్లికార్జున రావు, జయంతి తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital