శ్రీకాళహస్తి – పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై ఆ ప్రాంతంలో టైలర్ లైంగిక దాడికి యత్నించాడు.. దీనిని గమనించిన స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ది చేశారు.. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.. పట్టణ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసులు మాట్లాడుతూ స్థానికులు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు.. ఈ సంఘటనపై బాలిక తల్లి మాట్లాడుతూ. తన కుమార్తె బట్టలుకుట్టించు కోవడానికి టైలర్ వద్దకు వెళ్లగా అ వ్యక్తి తమ కుమార్తెను ఇంటిలో నిర్బంధించి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని వాపోయింది. అక్కడే ఉన్న వారు చూసి అతడికి దేహశుద్ది చేశారని తెలిపింది.. ఇటువంటి దుర్మార్గపు సంఘటన చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement