Saturday, November 23, 2024

నిబంధనలు అతిక్రమించి టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు : ఎస్పీ పరమేశ్వర్‌ రెడ్డి

తిరుపతి సిటీ : నిబంధనలను అతిక్రమించి టపాసులు విక్రయించినా.. నిల్వ ఉంచినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరమేశ్వర్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన నగరంలో పలు టపాసులు దుకాణాలు వద్ద తనిఖీ చేపట్టారు. వడమాలపేట వద్ద జరిగిన అగ్నిప్రమాదం దృష్టిలో ఉంచుకుని టపాకాయల దుకాణ యజమానులను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. లైసెన్స్‌ ఉన్న దుకాణంలోనే బాణసంచా కొనుగోలు చేయాలన్నారు. అలాగే బాణసంచా ప్యాకెట్లపై ముద్రించిన తయారు తేదీ, ప్యాకెట్‌ పై తయారీదారు ముద్రించిన జాగ్రత్తలను పాటించాలని కోరారు. సగం కాలిన టపాసులను మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయరాదన్నారు. అలాగే గాజు సీసాలు ఇనుప రేకులతో కూడిన డబ్బాలో బాణసంచా కాల్చడం చాలా ప్రమాదకరమన్నారు. ఆసుపత్రి వద్ద వీధుల్లో సంచరించే జంతువుల వద్ద బాణసంచా కాల్చరాదన్నారు. పెద్దలు టపాసులు కాల్చేటప్పుడు పిల్లలను దూరంగా ఉంచాలన్నారు.

బాణసంచా కాల్చేటప్పుడు కాటన్‌ దుస్తులు ధరించాలి అదేవిధంగా రోడ్డు వెంబడి వెళ్లే వాహనాలకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా టపాసులు కాల్చాలని తెలియజేశారు. చిన్నారులు తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే బాణసంచా కాల్చాలన్నారు. జిల్లాలో తాత్కాలిక బాణాసంచ విక్రయాలకు అనుమతులు పొందిన వారంతా నిర్ణీత ప్రాంతంలోనే విక్రయాలు జరపాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్య ఆరోగ్యశాఖ జారీచేసిన ఉత్తర్వులు మేరకు దీపావళి సందర్భంగా బాణసంచా కొనుగోలుదారులు, అమ్మకం దారులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా గ్రీన్‌ కాకర్స్‌ ముసుగులో నిషేధిత రసాయనాలతో తయారైన బాణసంచా బాక్సులు పై లేబులను మార్చి విక్రయించినా, అక్రమంగా నిల్వ ఉంచిన ప్రభుత్వ అనుమతి లేకుండా విక్రయించినరవాణా చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పు అని తెలియజేశారు. ప్రజలు దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్‌ డిఎస్పి మురళీకృష్ణ. ఈస్ట్‌. సీఐ. శివప్రసాద్‌ రెడ్డి. యూనివర్సిటీ- సీఐ రవీంద్ర పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement