తిరుపతి సిటీ ప్రభ న్యూస్ : విద్యుత్ ఉద్యోగులు క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా ఒత్తిడిని దూరం చేయవచ్చని ఏపీఎస్పిడిసిఎల్ డైరెక్టర్ (ఫైనాన్స్ & హెచ్ఆర్) విఎన్ బాబు పేర్కొన్నారు. ఏపీఎస్పీడీసీఎల్ స్పోర్ట్స్ కౌన్సిల్, తిరుపతి సర్కిల్ ఆధ్వర్యంలో ఈనెల 5వతేదీ నుంచి 7వతేదీ వరకు మూడు రోజులపాటు జరిగే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్స్ ఇంటర్ సర్కిల్ ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్ టోర్నమెంట్ – 2021-22 ప్రారంభ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల క్రీడామైదానంలో నిర్వహించారు. ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (ఫైనాన్స్ & హెచ్ఆర్) విఎన్ బాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు క్రీడల ద్వారా మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవడంతోపాటు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. తద్వారా ఉద్యోగులు విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. ఈనెల ఆరవ తేదీన యోగా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ యోగా చేయడాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ఉద్యోగులు ఆశావహ దృక్పథం ఐకమత్యంతో విధులు నిర్వహిస్తూ సంస్థ అభివృద్ధికి తమవంతు చేయూత అందించాలని కోరారు.
అనంతరం ఎపిఎస్పిడిసిఎల్ నాన్-హోల్ టైం ఉమన్ డైరెక్టర్ డాక్టర్ పిబి శశికళ మాట్లాడుతూ రోజుల్లో 24 గంటలూ పని ఒత్తిడిలో ఉండే విద్యుత్ ఉద్యోగులు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ఉద్యోగులు క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా స్నేహపూరిత వాతావరణాన్ని పెంపొందించుకోవచ్చని అన్నారు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తితో ఉద్యోగులు పోటీల్లో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పిడిసిఎల్ స్పోర్ట్స్ కౌన్సిల్, తిరుపతి సర్కిల్ అధ్యక్షులు, సూపరింటెండింగ్ ఇంజనీర్ డివి చలపతి, స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. కృష్ణారెడ్డి, జనరల్ మేనేజర్లు పి. అయూబ్ ఖాన్, కెఆర్ఎస్ ధర్మజ్ఞాని, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రమణ, అమర్ బాబు, చిన్నరెడ్డెప్ప, హరి, బాలాజీ, స్పోర్ట్స్ ఆఫీసర్ టిడి కుమార వడివేలు, స్పోర్ట్స్ . గేమ్స్ కార్యదర్శి పురుషోత్తం, రాష్ట్రంలోని వివిధ విద్యుత్ సంస్థల నుంచి విచ్చేసిన ఉద్యోగులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు… ఫోటో రైట్ అప్.. క్రీడలను ప్రారంభిస్తున్న దృశ్యం..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.