Friday, November 22, 2024

వైసీపీ గూండాల అరాచకాలుకు అడ్డుక‌ట్ట వేయండి..

తిరుపతి సిటీ : మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నాయకులు పై వైసీపీ గూండాలు పోలీసుల సహకారంతో దాడులు చేయడానికి ఖండిస్తూ జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి మంగళవారం వినతి పత్రాన్ని టీడీపీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్ మాట్లాడుతూ.. ఈ ఘటన పోలీసులు ఘోర వైఫల్యం అయిందన్నారు. వైసీపీ గుండాలు గుంపును నియంత్రించడానికి బదులుగా పోలీసులు టీడీపీ నాయకులని అదుపులోకి తీసుకొని మాచర్ల పట్టణం నుండి బలవంతంగా బయటికి పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అలాగే వైసీపీ నాయకులను అదుపు చేయకపోగా పోలీసులు వారికి ఎందుకు వత్తాసు పలుకుతున్నారు . అంతు పట్టడం లేదన్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు పై జరిగిన దాడి ప్రజాస్వామ్య వ్యవస్థ పై జరిగిన దాడిగా పరిగణించాల్సి ఉందన్నారు. పోలీసులు పక్షపాత ర వ్యవహరించినప్పుడే ప్రాథమిక హక్కులు. ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించి ఆసంగీకశక్తులపై ఆర్టికట్టుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం నియోజకవర్గ ఇన్ చార్జి సుగుణమ్మ మాట్లాడుతూ… నియోజకవర్గ ఇన్ చార్జి బ్రహ్మానంద రెడ్డి పై తప్పుడు కేసు పెట్టడానికి పోలీసులు ముందస్తు ప్రణాళికతో డిసెంబర్ 16వ తేదీన గ్రామంలో తనిఖీలు చేపడం జరిగిందని వివరించారు.నిప్పు పెట్టడంతో పాటు టీడీపీ నేతల ఇళ్లపై దాడి చేసి అడ్వాన్సులు సృష్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీడీపీ నేత యర్రం పోలిరెడ్డి ఇంటిపై దాడి చేసి నిప్పంటించడం చాలా బాధాకరమన్నారు 15 సవరాలు బంగారు, లక్షల రూపాయల నగదు లూటీ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, నగర అధ్యక్షులు చినబాబు, కార్యదర్శి మహేష్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శులు సూర సుధాకర్ రెడ్డి, బుల్లెట్ రమణ, విజయ్ కుమార్, తెలుగుదేశం నాయకులు మునిశేఖర్ రాయల్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement