Wednesday, January 8, 2025

TTD | 8న‌ ప్ర‌యాగ్ రాజ్ కు శ్రీవారి క‌ళ్యాణ ర‌థం…

ఉత్త‌రప్ర‌దేశ్ లోని ప్రయాగ రాజ్‌(అలహాబాద్‌) వ‌ద్ద‌ జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తేది జ‌ర‌గ‌నున్న మ‌హా కుంభ‌మేళాలో తిరుమ‌లేశుడి న‌మూనా ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు టీటీడీ తెలిపిన సంగతి తెలిసింది. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో టీటీడీ ఈవో. జే.శ్యామ‌ల‌రావు మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ…

ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్ 6, భజరంగ్ దాస్ రోడ్డులోని నాగ‌వాసుకి ఆలయ స‌మీపంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన 2.89 ఎక‌రాల్లో శ్రీవారి నమూనా ఆలయ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాది భక్తులు శ్రీవారి వైభవాన్ని సంతృప్తిగా తిలకించేలా తిరుమల తరహాలో స్వామివారి కైంకర్యాలు, ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రతిరోజు తిరుమల తరహాలో నిత్యం సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు అన్ని సేవలు నిర్వహిస్తామన్నారు.

జ‌నవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీలలో శ్రీవారి కల్యాణాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తునట్లు చెప్పారు. మ‌హా కుంభ‌మేళాలో శ్రీ‌వారి న‌మూన‌ ఆల‌య నిర్వ‌హ‌ణ‌, భ‌క్తుల సౌక‌ర్యాల ఏర్పాటుకు టీటీడీ నుండి అర్చ‌క స్వాములు, వేద పండితులు, వివిధ విభాగాల సిబ్బందిని ప్రయాగ్ రాజ్ కు పంపుతున్నట్లు తెలిపారు. కాగా, తిరుమల నుండి ప్రయాగ్ రాజ్ కు 8వ తేది ఉదయం 7 గంటలకు శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరుతుందని తెలియజేశారు.

- Advertisement -

వైకుంఠ ఏకాద‌శి.. భద్రతపై ప్రత్యేక చర్యలు !

వైకుంఠ ఏకాదశి (జనవరి 10న‌) 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరిచి ఉంచుతామని టీటీడీ ఈవో శ్యామరావు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఈ సందర్భంగా బందోబస్తుపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, టోకెన్ల జారీ కేంద్రాల వద్ద విజిలెన్స్, పోలీసుల సహకారంతో భద్రత కల్పిస్తామన్నారు.

అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా తగిన ఏర్పాట్లు చేశామని, రంభకిచ్చా వద్ద వీఐపీల వాహనాలకు అనుమతిస్తామని తెలిపారు. దాదాపు 12 వేల వాహనాలకు పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. అన్నప్రసాద కేంద్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement