Wednesday, November 20, 2024

శ్రీసిటీ రూ.10 లక్షల వితరణ – ప్రభుత్వ పాఠశాలలో నూతన తర‌గ‌తి గది నిర్మాణం…

సత్యవేడు – శ్రీసిటీ ఫౌండేషన్ చొరవతో కార్పొరేట్ సామాజిక బాధ్యతలో (సీ ఎస్ ఆర్) భాగంగా శ్రీసిటీలోని పార్క్‌సన్స్ ప్యాకేజింగ్ లిమిటెడ్ పరిశ్రమ యాజమాన్యం 10 లక్షల రూపాయల వ్యయంతో మండలంలోని గొల్లవారిపాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్మించిన నూతన తరగతి గది భవనాన్ని శుక్రవారం ఉదయం ఆ పరిశ్రమ హెడ్ సేతు సుబ్రమణియన్ తన భార్యతో కలిసి ప్రారంభించారు. తరగతి గదితో పాటు డెస్కులు, బెంచీలను కూడా వితరణగా తరగతి గదిలో ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం అనంతరం అధికారికంగా తరగతి గదిని పాఠశాల ప్రధానోపాధ్యాయులుకు అప్పగించారు. ఈ సందర్భంగా సేతు సుబ్రమణియన్ మాట్లాడుతూ, శ్రీసిటీ పరిసరాల్లోని ప్రభుత్వ పాఠశాలల మౌళిక సదుపాయాలను మెరుగుపరచడానికి తాము చాలా ఆసక్తిగా ఉన్నామన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా సీఎస్ఆర్ నిధులను ఇందుకు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. పార్క్‌సన్స్ ప్యాకేజింగ్ సంస్థ వితరణ పట్ల స్కూల్ ప్రధానోపాధ్యాయులు వారికి కృతఙ్ఞతలు తెలిపారు. శ్రీసిటీ పరిసర ప్రభుత్వ పాఠశాలల మౌళిక వసతుల మెరుగుదలకు కృషి చేస్తున్న శ్రీసిటీ ఫౌండేషన్ పనితీరును ప్రశంసించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీసిటీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ రమేష్ సుబ్రమణ్యం, ఫౌండేషన్ మేనేజర్ సురేంద్ర కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement