తిరుపతి ముఖచిత్రం
పొత్తు లేకుండా ఏడుసార్లు టీడీపీ పోటీ.. ఒక్కసారే గెలుపు
ఆరుసార్లు బీజేపీ ఒంటరి పోరు.. అన్నిసార్లూ పరాభవమే
బీజేపీ-టీడీపీ పొత్తుతో ఒక్కసారి వరించిన విజయం
కాంగ్రెస్ కోటలో పాగా వేయగలిగిన వైకాపా
తిరుపతి, ప్రభన్యూస్‌బ్యూరో (రాయలసీమ): తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల చరిత్రను గమనిస్తే, అటు తెలుగుదేశం పార్టీకి, ఇటు భారతీయ జనతాపార్టీకి ఒంటరిపోరు కలిసి రాలేదనే అంశం స్పష్టమవుతోంది. తిరుపతి లోక్‌సభ స్ధానానికి జరిగిన 16 ఎన్నికలలో 10 సార్లు కాంగ్రెస్ పార్టీ, రెండు సార్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, భాజపా, తెలుగుదేశం పార్టీలు చెరొకసారి మాత్రమే గెలుపొందాయి. అదికూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత జరిగిన తొలి సారి ఎన్నికల్లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థి గెలిచారు. ఒంటరిగా ఆరేడుసార్లు పోటీ చేసినా గెలవని భాజపా మూడుసార్లు తెలు గుదేశం పార్టీ మద్దతుతో పోటీచేసి ఒక్కసారి విజయం సాధించగలిగింది.
ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి 13 సార్లు సాధారణ ఎన్నికలు, మూడుసార్లు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. 1952 నుంచి 1980 వరకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు మాత్రమే గెలుస్తూ వచ్చారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత, 1984లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్ధిగా చింతా మోహన్ విజయం సాధించారు. తర్వాత పరిణామాలలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ఇప్పటివరకు ఆపార్టీలోనే కొనసా గు తున్నారు. పార్టీల పరం గా చూసినప్పుడు తొలి నుంచి ఇప్పటి వరకు తిరుపతి లోక్‌సభ స్ధానానికి జరిగిన 16 ఎన్నికలలో 9 సార్లు పో టీ చేసిన చింతా మోహన్,ఆరు సార్లు విజయం సా ధించిన ఏకైక వ్యక్తిగా చరిత్రలో నిలి చారు. రాష్ట్ర విభజనఅనంతర పరిణా మాలలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట మసకబా రిపోవడం మొదలైంది. ఆ స్థానాన్ని ఆక్రమించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2014. 2019 వరుస ఎన్నికలలో విజయం సాధించింది. ఇక 1984లో ఒక్కసారి మాత్రమే గెలిచిన తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు ఏడుసార్లు ఒంటరిగా పోటీ చేసి ఓటమిపాలైంది. అలాగే జాతీయ పార్టీ భాజపా 1980, 1991, 1996, 1998, 2009, 2019 ఒంటరిగా పోటీ చేసి ఓటమిపాలైనా 1999, 2004, 2014 ఎన్నికలలో తెలుగుదేశం మద్దతుతో పోటీ చేసింది. తెలుగుదేశం పార్టీ మద్దతుతో మూడు ఎన్నికలలో బరిలో నిలవగా, 1998లో భాజపా గెలవడంతోపాటు రెండు ఎన్నికలలో ఓట్లశాతాన్ని గణనీయంగా పెంచుకోగలిగింది. ఈ చరిత్రను పరిశీలిస్తే అటు తెలుగుదేశం పార్టీకి కానీ, ఇటు భాజపాకి కానీ తిరుపతి లోక్‌సభ ఎన్నికలలో ఒంటరిపోరు కలిసి రాలేదని స్పష్టమవుతోంది. కానీ ఈసారి కూడా విడివిడిగా పోటీలో దిగిన ఈ రెండు పార్టీలలో గెలుపు తమదేననే ధీమాతో ఉన్నాయి. 2014 ఎన్నికలలో తెలుగుదేశం మద్దతుతో పోటీ చేసిన భాజపా అభ్యర్థికి జనసేన పార్టీ బయటి నుంచి మద్దతు నిచ్చింది. 2019 ఎన్నికలలో పొత్తు ధర్మంగా వామపక్షాలతో కలిసి బీఎస్‌పి అభ్యర్థికి జనసేన పార్టీ మద్దతు నిచ్చింది. ప్రస్తుతం జరగనున్న ఉప ఎన్నికలో జనసేన పార్టీ మద్దతుతో భాజపా పోటీ చేస్తోంది. ప్రస్తుత ఎన్నికలలో కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థులు కూడా బరిలో ఉన్నా ఆయా పార్టీల అభ్యర్ధుల బలాబలాల కోణంలో చూసినప్పుడు 2009 ఎన్నికల తరహాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. భాజపా-జనసేన కూటమి అభ్యర్థుల మధ్య తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ముక్కోణపు పోటీకి వేదిక అవుతోందని స్పష్టమవుతోంది.
గత ఆరు ఎన్నికల్లో వివిధ పార్టీలకు లభించిన ఓట్ల శాతం
సంవత్సరం 1998 1999 2004 2009 2014 2019
పోలైన ఓట్లశాతం 63.14 69.89 69.99 72.52 77.04 79.76
కాంగ్రెస్ 38.52 47.31 60.06 40.36 2.75 1.83
భాజపా 23.84 – – 2.04 – 1.22
తెలుగుదేశం 37.27 – – 38,54 – 37.65
భాజపా- తెదేపా – 48.89 36.63 – 44.76 –
వైఎస్సార్ కాంగ్రెస్ – – – – 47.84 55.03
సిపిఎం అభ్యర్ధికి సిపిఐ మద్దత్తు..
తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థి ఎన్. యాదగిరిని సీపీఐ బలపరుస్తున్నట్లు- ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తెలి పారు. విజయవాడలో రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారా య ణమూర్తి అధ్యక్షతన జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమా వేశంలో ఈ మేరకు నిర్ణయించామన్నారు. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు తిరుపతి పార్లమెంటు- పరిధిలో ఉన్న సీపీఐ శ్రేణులు కామ్రే డ్ ఎన్. యాదగిరి గెలుపు- కోసం కృషి చేయాలని, ప్రచారంలో పా ల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే చిత్తూరు, నెల్లూరు జిల్లాల పార్టీ కమిటీ-లు సీపీఎంతో సమన్వయం చేసుకుని ప్రచారం నిర్వ హించా లన్నారు.