ముస్లిం సోదర, సోదరీమణులకు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు మొహర్రం శుభాకాంక్షలు తెలిపారు. మొహర్రం పండుగ ఎంతో ప్రాధాన్యత కలిగిన పండుగగా ముస్లిం సోదరులు కుటుంబ సభ్యులతో సుఖసంతోషాల నడుమ భక్తి భావంతో, శాంతియుతంగా పండుగను జరుపుకోవాలన్నారు.
ప్రజల మధ్య స్నేహభావం పెంపొందడం ద్వారా మనం సుదీర్ఘమైన శాంతిని సాధించగలమన్నారు. అందరూ సురక్షితంగా ఉండాలని, మొహర్రం సందర్భంగా ప్రార్థనలు శాంతియుతంగా చేసుకోవాలని జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు తెలిపారు.
- Advertisement -