Tuesday, November 26, 2024

ఇసుక టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేయాల్సిందే – సోము వీర్రాజు..

తిరుపతి – ఎపి ప్ర‌భుత్వం ఇసుక పంపిణీ కోసం ఇచ్చిన టెండ‌ర్ నోటీస్ ను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.. : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇసుక విధానానికి వ్యతిరేకంగా బిజెపి నేడు నిరసనకు పిలుపు ఇచ్చింద‌వి.. దీనిలో భాగంగా సోము వీర్రాజు నాయ‌కత్వంలో పెద్ద ఎత్తున క‌మ‌లం శ్రేణులు ఆర్డీవో కార్యాల‌యానికి చేరుకున్నారు.. అయితే తిరుప‌తిలో ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉండ‌టంతో అక్క‌డికి చేరుకున్న వారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ప‌రిమిత సంఖ్య‌లో నేత‌లు ఆర్డీవోని క‌ల‌సి ఇసుక టెండ‌ర్లు రద్దు కోరుతూ విన‌తిప‌త్రం అంద‌జేశారు.. ఈ సంద‌ర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ,రాష్ట్రంలో ఉన్న ఇసుక పంపిణీ కోసం రూ.760 కోట్లకు టెండర్ విధానం ద్వారా ఇవ్వడం జరిగిందిద‌న్నారు.. దీంతో బంగారం కంటే ఇసుక దరే ఎక్కువయ్యే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంద‌ని చెప్పారు. సామాన్య ప్రజలు ఇసుక ని బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంద‌ని అన్నారు.. కొత్త విధానంతో 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఉంద‌ని అవేద‌న వ్య‌క్తం చేశారు. ఇసుక విధానంలో సరైన అవగాహన రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడంతో అనేక అక్రమాలు జరిగే అవకాశం ఉంద‌ని ఆరోపించారు.. ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలించేందుకు కొంతమంది ప్రభుత్వంలో ఉన్న నాయకులు పన్నిన పన్నాగం ఈ టెండర్ విధాన‌మంటూ సోము ఫైర్ అయ్యారు. టెండరు విధానాన్ని రద్దు చేసి, ఉచితంగా ఇసుకను ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలోనే అత్యధికంగా లభించే ఇసుక ఆంధ్రప్రదేశ్ లోనే ఉంద‌ని అయితే ప్రభుత్వ అండతో రాబందులు ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నాయంటూ సోము ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, సైకం జయచంద్రారెడ్డి, రమేష్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement