Saturday, November 23, 2024

ఆరుగురు ఎర్ర చందనం స్మగ్లర్లు అరెస్ట్‌.. రూ.కోటి విలువైన దుంగలు స్వాధీనం

తిరుపతి సిటీ : అంతరాష్ట్ర ఎర్రచందన స్మగ్లర్లు 6 మంది అరెస్టు చేయడంతో పాటు వారి నుంచి కోటి రూపాయలు విలువ గల 31 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకోవడంతో పాటు రెండు కార్లు రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ పరమేష్ రెడ్డి మాట్లాడుతూ.. అక్రమ రవాణా కట్టడికి ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. తిరుపతి జిల్లా వెస్ట్ సబ్ డివిజన్ భాకరాపేట సర్కిల్ ఎర్ర వారి పాలెం పరిధిలో కోటి రూపాయలు విలువగల ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు రెండు కార్లు రెండు ద్విచక్ర వాహనాలను సాధించడం జరిగిందని తెలియజేశారు. ప్రతిరోజు విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేపట్టడం జరుగుతున్నదన్నారు. ఎర్ర వారి పాలెం మండలం ఎల్లమంద పంచాయితీ, ఎల్లమంద, ఉస్తికా యల పెంట రోడ్ల గల ఎల్లమంద క్రాస్ వద్ద అంతరాష్ట్ర ఎర్రచందన ముఠాకి చెందిన ఒకరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే పరారీలో ఐదు మంది ఉన్నారన్నారు.

అక్రమ రవాణాల్లో పట్టుబడిన ముఠా సభ్యులు అనేక పర్యాయాలు శేషశాల అడవుల్లోకి వచ్చి ఎర్రచందన దొంగలను నరికి వెళ్లే వారన్నారు. వీరిపై ఇదివరకే కేసులు ఉన్నాయన్నారు. వీరంతా తమిళనాడు రాష్ట్రం పరిసర ప్రాంతాలకు చెందిన ముఠా సభ్యులుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. పారిపోయిన ముద్దాయిలందరూ అంతరాష్ట్ర స్మగ్లర్లే అన్నారు. ఎర్రచందనం కూలీలను శేషాచల అడవుల్లోకి తీసుకుని వచ్చి ఎర్రచందనం చెట్లను నరికి చెన్నై, బెంగళూరులోని బడా స్మగ్లర్లకు దొంగలను సరఫరా చేసే వారిని విచారణలో తేలిందన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను కట్టడి చేయడానికి ప్రత్యేక నిఘా వ్యవస్థ తో పాటు బృందాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా నిఘా ఉంచడం జరిగిందన్నారు. అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదన్నారు. అరెస్టు కాబడిన వారిలో తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా, అనుడుర్ గ్రామం చెందిన షేక్ శాఫీల, 39 సంవత్సరాలు. పరార్ లో ఉన్నవారు తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి జిల్లా అమ్మపల్లి గ్రామం చెందిన గోపీనాథ్ పేతి నాయుడు 30 సంవత్సరాలు. అదే జిల్లా అలసండపురం గ్రామానికి చెందిన బి ఆనందం 60 సంవత్సరాలు. అదే రాష్ట్రం వేలూరు జిల్లా అలసండ పురం గ్రామానికి చెందిన గజేంద్ర 36 సంవత్సరాలు. తమిళనాడు రాష్ట్రం నట్రవల్లి తాలూకా చెందిన అనుముతు 30 సంవత్సరాలు వీరు పరార్ లో ఉన్నారన్నారు. వీరి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. వెస్ట్ డిఎస్పి నర్సప్ప సూచనలకు అనుగుణంగా భాకరాపేట సిఐ తులసీరామ్, ఎస్సై ప్రకాష్, వెంకటేశ్వర్లు సిబ్బంది నిఘా ఉంచి పట్టుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అడిషనల్, ఎస్పీ అడ్మిన్ వెంకట్రావు. లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ కులశేఖర్, క్రైమ్ అదనపు ఎస్పీ, విమల కుమారి, వెస్ట్ డిఎస్పి నర్సప్ప, సిఐ తులసీరామ్, ఎస్సైలు ప్రకాష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement