Saturday, November 23, 2024

టాస్క్ ఫోర్స్ అధికారులతో ఎస్ఈబీ డైరెక్టర్ సమీక్ష

అనంతపురం రేంజ్ డీఐజీ ఆధీనంలో ఉన్న ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ ను ఎస్ఈ బీ ఆధీనంలోకి మార్చడంతో గురువారం ఎస్ఈబీ డైరెక్టర్ ఆవుల రమేష్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ అధికారులతో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు టాస్క్ ఫోర్స్ పనితీరు గురించి చర్చించారు. తరువాత భవిష్యత్తు కార్యాచరణ గురించి పలు సూచనలు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించిన ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు గురించి తెలుసుకున్నారు. ఇంటర్ స్టేట్ ఆపరేషన్ ల గురించి ఆరా తీశారు. ఈ సమావేశంలో స్మగ్లర్లు పొరుగు రాష్ట్రాల నుంచి రాకుండా నిరోధించడానికి త్వరలోనే ఆయా రాష్ట్రాల అధికారులతో సమావేశం కావాలనే నిర్ణయం తీసుకున్నారు.

ఇంకా సాంకేతికంగా ఏ విధంగా ఎర్రచందనం చెట్లను రక్షించ దానికి చర్యలు తీసుకోవాలనే విషయం పై చర్చించారు. కోర్టు మానిటరింగ్, ఖైదీ లకు పడుతున్న శిక్షల గురించి తెలుసుకున్నారు. పై అంశాల అమలు పటిష్టంగా చేపట్టడానికి తగిన సూచనలు చేశారు. ఈ సమావేశంలో టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందర రావు పాల్గొని ఎస్ఈబీ డైరెక్టర్ సూచనలు పాటిస్తామని, స్మగ్లర్లు అడవిలోకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్మగ్లింగ్ విధానం గురించి డీఎస్పీ మురళీధర్ వివరించగా ఆర్ ఐ లు సురేష్ కుమార్ రెడ్డి, ఆలీ బాషా, కృపానంద, సిఐ చంద్రశేఖర్, ఎఫ్ఆర్ఓ లు ప్రసాద్, ప్రేమ, ఆర్ ఎస్ ఐలు లింగాధర్, వినోద్ కుమార్ రెడ్డి, సీసీ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement