శ్రీవారి దర్శన టికెట్లను బ్లాక్ లో విక్రయించిన కాణిపాకం సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రూ.300 దర్శన టికెట్లను రూ.32 వేలకు విక్రయించారు. మొత్తం 12 టికెట్లు విక్రయించినట్లు గుర్తించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కరుణ కుమారిపై భక్తుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీవారి దర్శన టికెట్లను కాణిపాకం సిబ్బంది విక్రయాలకు పాల్పడ్డారు. కరుణ అనే ఉద్యోగిని సుపథం టికెట్లను సేవా టికెట్లుగా విక్రయించింది. కాణిపాకం ఏఈవో మాధవరెడ్డి సిఫార్సు లేఖతో 12 టికెట్లు పొందగా వాటిని కాణిపాకం దేవస్థానంలో గ్యాస్ టెక్నిషియన్‌గా పనిచేస్తున్న కరుణ కర్నాటకకు చెందిన భక్తులకు రూ.32 వేలకు విక్రయించింది. ఆ భక్తులు టీటీడీకి ఫిర్యాదు చేశారు. నిందితురాలిపై కేసు నమోదు చేశామని తిరుమల ఏఎస్పీ ముని రామయ్య వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement