తిరుపతి ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రత్నప్రభ నామినేషన్ కు రిటర్నింగ్ అధికారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. అంతకు ఆమె నామినేషన్ పై అభ్యంతరం వక్తం చేస్తూ జనతాదళ్ అభ్యర్ధి రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆమెపై ఉన్న కేసులను పేర్కొనకుండా నామినేషన్ రత్నప్రభ దాఖలు చేశారంటూ అందులో పేర్కొన్నారు.. అయితే నామినేషన్ ను పరిశీలించి రిటర్నింగ్ అధికారి అభ్యంతరాలను తొసిపుచ్చారు.. కాగా ఈ ఎన్నికలలో మొత్తం 78 తమ నామినేషన్లు దాఖలయ్యాయి.. నామినేషన్ ల పరిశీలన అనంతరం నాలుగు నామినేషన్లను తిరస్కరించారు.. ప్రధాన పార్టీల నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ప్రకటించారు.. కాంగ్రెస్ తరుపున చింతా మోహన్, వైసిపి తరుపున గురుమూర్తి, సిపిఎం తరుపున కోటిరెడ్డి, టిడిపి తరుపున పనబాక లక్ష్మీ రంగంలో ఉన్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement