Saturday, November 23, 2024

తిరుమలలో త‌గ్గిన‌ భక్తుల రద్దీ..

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకునేందుకు వివిద ప్రాంతాల నుంచి భ‌క్తులు తిరుమ‌ల‌కు చేరుకున్నారు. రెండు రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంద‌ని, శనివారం 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నార‌ని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.80 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. తిరుమల శ్రీవారిని 63,443 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 26,741 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement