చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని మంగళం పేట బీట్ లోని కొత్తపల్లి వద్ద కారులో రవాణా కు సిద్ధంగా ఉన్న ఏడు ఎర్రచందనం దుంగలను కారుతో సహా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం రేంజ్ డీఐజీ కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు డిఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో ఆర్ ఐ భాస్కర్ టీమ్ లోని ఆర్ ఎస్ ఐ లింగాధర్ బృందం బుధవారం రాత్రి నుంచి మంగళం పేట బీట్లో కూంబింగ్ చేస్తున్నారు. గురువారం తెల్లవారుజామున ఒక కారు లోడింగ్ పాయింట్ వద్ద కనిపించింది. అక్కడకు వెళ్లగా కొంతమంది కారులో ఎర్రచందనం దుంగలు కారులో లోడ్ చేస్తూ కనిపించారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది ని చూడగానే దుంగలు పడవేసి చీకట్లో, పొదల్లోకి పారిపోయారు. కారు డ్రైవర్ కారును ముందుకు ఉరికించగా, టాస్క్ ఫోర్స్ సిబ్బంది కారును ఆపే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం లో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో డ్రైవర్ కారు ను వదిలి పారిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ప్రాణాలకు తెగించి కారుకు అడ్డం పడి అపారని తెలిపారు. ఈ టీమ్ కు డీఐజీ రివార్డులు ప్రకటించారని తెలిపారు. అడవిలోకి పారిపోయిన స్మగ్లర్లు కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఎఫ్ ఆర్ ఓ ప్రసాద్, సి ఐ వెంకట్ రవి, ఆర్ ఐ భాస్కర్ అక్కడకు చేరుకుని, పరిస్థితి ని సమీక్షించారు. టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ ఎస్ ఐ మోహన్ నాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
Advertisement
తాజా వార్తలు
Advertisement