తిరుపతి పార్లమెంటుకు జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై కసరత్తు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. జనసేన మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఎఎస్ అధికారి రత్నప్రభ పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసినట్లు విశ్వసనీ య సమాచారం. నేడో, రేపో అధికారికంగా బీజేపీ కేంద్ర నాయకత్వం అధికారికంగా ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. రాష్ట్ర బీజేపీ తరుపున పోటీకి సంసిద్ధత వ్యక్తం చేసిన అభ్యర్థుల జాబితాను గతవారం కేంద్ర బీజేపీ ఎన్నికల కమిటీకి పంపారు. వీరి అభ్యర్థిత్వాలను పరిశీలించిన కేంద్ర ఎన్నికల కమిటీ రత్నప్రభ, మరో మాజీ ఐఎ ఎస్ డాక్టర్ దాసరి శ్రీనివాసుల పేర్లను పరిశీ లించింది. కాగా కేంద్ర నాయకత్వం రత్నప్రభవైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల గెలుపును బీజేపీ నాయకత్వం ప్రతిష్టా త్మకంగా తీసుకుంది. దక్షిణాదిలో పాగాకు ఏపీని ముఖ ద్వారంగా భావిస్తున్న బీజేపీ కేంద్ర నాయ కత్వం తిరుపతి ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టింది. కేంద్ర పార్టీ నిర్ణయానికి అనుగుణంగా బీజేపీ రాష్ట్ర నాయ కత్వం కొద్ది నెలలుగా తిరుపతిపై ప్రత్యేక దృష్టి సారించింది. తిరుపతి అభివృద్ధికి బీజేపీ చేసిన పలు కార్యక్రమాలు అవకాశం ఉన్నప్పుడల్లా ప్రజలకు వివరించే ప్రయత్నాల్లో రాష్ట్ర నాయకత్వం ఉంటోంది. ఈ క్రమంలోనే తిరుపతి ఉప ఎన్నిక నోటిఫికేషన్ రావడంతో అభ్యర్థి ఎంపికపై రాష్ట్ర నాయకత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. గతం నుంచి తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న మాజీ ఐఎఎస్ అధికారి దాసరి శ్రీనివాసులుతో పాటు కర్నా టక కేడర్ మాజీ ఐఏఎస్ రత్నప్రభ, మరికొందరు పేర్లతో జాబితా రూపొం దించారు. ఇప్పటికే అధికార వైసీపీ, తెలుగుదేశం పార్టీలు అభ్యర్థిని ప్రకటించి నామినేషన్లకు సిద్ధమవుతున్న తరుణంలో బీజేపీ నాయకత్వం అభ్యర్థి ఎంపికపై కొలిక్కి వచ్చింది. వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని ఆమె పేరును ఎంపిక చేసినట్లు సమాచారం. ఆమె పేరు ప్రకటించిన తర్వాత నామి నేషన్ వేసేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు.
గెలుపు లక్ష్యంగా..
గత కొద్ది రోజులుగా తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపుకు బీజేపీ నేతలు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అభ్యర్థి ఎంపిక కొలిక్కి వచ్చిన తరుణంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై మంగళవారం రాత్రి తిరుపతిలో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు తెలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో జరిగిన సమావేశంలో ప్రచార కమిటీ అధ్యక్షుడు, మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి, బీజేపీ కేంద్ర నేతలు దగ్గుబాటి పురంధేశ్వరి, వై.సత్యకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్థన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూర్యనారా యణ(సూరి), సూర్యనారాయణ రాజు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి బలాలు, బలహీనతలతో పాటు సామాజిక వర్గాల సమీకరణ, గెలుపు వ్యూహాలు, ప్రచారంలో పాల్గొ నే జాతీయ నేతలు, కేంద్రమంత్రులు తదితర అం శాలను చర్చించినట్లు తెలిసింది. అధికారికంగా అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మరోసారి సమావేశమై విస్తృతంగా చర్చిం చేందుకు కోర్ కమి టీ నేతలు నిర్ణయించినట్లు సమాచారం.
తిరుపతి బిజెపి అభ్యర్ధిగా మాజీ ఐఎఎస్ రత్నప్రభ?
Advertisement
తాజా వార్తలు
Advertisement