తిరుమల మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు సోషియల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న నేపథ్యంలో ప్రస్తుత ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు,కృష్ణశేషాచల దీక్షితులు స్పందించారు. శ్రీవారి ఆలయంలో ఆగమశాస్ర్తబద్దంగానే పూజా కైంకర్యాలు నిర్వహిస్తూన్నామని, రమణదీక్షితులు ఉద్దేశపూర్వకంగానే టిటిడి పై ఆరోపణలు చేస్తూన్నారని తెలిపారు.
రంగనాయకులు మండపంలో రమణదీక్షితులు హయంలోనే మరమ్మత్తు పనులు నిర్వహించారన్నారు. ఆలయంలో తవ్వకాలు అంటు రమణదీక్షితులు తరుచు ఆరోపణలు చేస్తూన్నారని, రమణదీక్షితులును సీఎం జగన్ నాలుగు సంవత్సరాలు క్రితమే గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించినా విధులుకు హజరుకావడం లేదన్నారు.
అంతే కాకుండా రమణధీక్షితులు కుటుంబంలోఎవ్వరు కూడా విధులుకు హజరుకావడం లేదని…జీతాలు మాత్రం తీసుకుంటున్నారని వివరించారు. టీషర్ట్ ,లుంగి ధరిస్తే క్రిస్టియన్ గా పేర్కోన్న రమణదీక్షితులు….ఆరోపణలు చేసే సమయంలో ధరించినవి కూడా టీషర్ట్,లుంగియ్యేనని గుర్తు చేశారు.. , టిటిడి ఉదాసీనంగా వ్యవహరిస్తూండడంతోనే రమణదీక్షితులు తరుచు ఆవాస్త ఆరోపణలు చేస్తూన్నారన్నారు. రమణధీక్షితులు పై టిటిడి చర్యలు తీసుకోని భక్తుల మనోభావాలను కాపాడాలన్నారు.