Friday, November 22, 2024

వ్యక్తిగత సేవలందిస్తే టికెట్ ఇస్తారా..?: జీవిఎల్

తిరుపతిలో ఉప ఎన్నికలకు నామినేషన్ల పర్వం చివరి ఘట్టానికి చేరుకుంది. నామినేషన్ల తుది గడువు రేపటితో ముగియనుంది. దీంతో అటు ప్రచారంలో జోరును పెంచుతున్నాయి పార్టీలు. ఒకరిపై మరోకరు మాటల యుద్దాలకు తెరలేపుతున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వైసీపీపై విమర్శల వర్షం కురిపించాడు. సీఎం జగన్ కు వ్యక్తిగతంగా సేవలందించిన వ్యక్తికి ఎంపీ టికెట్ ఇస్తారా? అని మండిపడ్డారు. వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత సేవలు చేసినవారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వొచ్చు కదా? అని అన్నారు వైసీపీ పై విరుచుకుపడ్డారు.

తిరుపతి ఉపఎన్నిక ఇక జగన్ సేవ వర్సెస్ జనం సేవ అని జీవీఎల్ అన్నారు. ఏది కావాలో జనమే తేల్చుకోవాలని ఆయన సూచించారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధిలో ప్రధాని మోదీ ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. బీజేపీ చేసిన అభివృద్ధిని, గత, ప్రస్తుత పాలకుల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement