Saturday, November 23, 2024

బ్లూకోట్‌, రక్షక్‌ సిబ్బంది ప్రక్షాళన.. జనం మెచ్చేలా పనిచేయాలి : ఎస్పీ పరమేశ్వర్‌ రెడ్డి

తిరుపతి సిటీ: బ్లూ కోట్‌, రక్షక్‌ సిబ్బందిని ప్రక్షాలన కార్యక్రమాన్ని ఎస్పీ పరమేశ్వర్‌ రెడ్డి శ్రీకారం చుట్టారు. గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడే పాతుకుపోయిన వారిని ప్రక్షాలన చేశారు. పనిచేస్తున్న వారి పనితీరును బట్టి వారికి పోలీస్‌ స్టేషన్‌ వారిగా కేటాయించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన సిబ్బందిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించి వారికి పోస్టింగ్‌ కేటాయించారు. అంతేకాకుండా గతంలో జరిగిన ఫిర్యాదులు, ఆరోపణలు కూడా పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. అలాగే బ్లూ కోట్‌, రక్షక్‌ సిబ్బంది నిరంతరం ప్రజల్లో తిరుగుతూ పోలీస్‌ శాఖ ఇమేజ్‌ని పెంచాలని సూచించారు. పోలీసులకు సిబ్బంది మూల స్తంభాలని తెలియజేశారు.. అందరూ సమిష్టిగా క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. పోలీస్‌ స్టేషన్‌ అనుసంధానంలో ఉంటూ నిబద్ధతతో పనిచేయాలని కోరారు.. నగరంలో ఎక్కడపడితే అక్కడ పార్కింగ్‌ చేసి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, నిరంతరం ప్రజల్లో తిరుగుతూ వారికి తాము ఉన్నామని భరోసా కల్పించాలన్నారు. ప్రజల వద్ద చిన్న, చిన్న వ్యాపారస్తుల వద్ద అవినీతికి పాల్పడినట్లు- తెలిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలు కూడా చైతన్యవంతులయ్యారని ప్రజల నుండి కూడా నేరుగా ఫిర్యాదు చేసిన కూడా వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. పనితీరు మార్చుకుని ప్రజల్లో శభాష్‌ అనిపించేలా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ లా అండ్‌ ఆర్డర్‌ కులశేఖర్‌, -కై-మ్‌ అదనపు ఎస్పి విమల కుమారి, అదనపు ఎస్పి అడ్మిన్‌ సుప్రజ, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పిలు వెంకటరమణ, చంద్రశేఖర్‌, వేస్ట్‌ డీఎస్పీ నర్సప్ప, ఈస్ట్‌ డీఎస్పీ మురళీకృష్ణ, కమాండ్‌ కంట్రోల్‌ డిఎస్పి కొండయ్య, ట్రాఫిక్‌ డిఎస్పి వన్‌ కాటమరాజు, విజయ శేఖర్‌, దిశ పోలీస్‌ స్టేషన్‌ డిఎస్పి రామరాజు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement