Saturday, November 23, 2024

6న ఆర్టీసీ డిపో ప్రారంభించనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి

నెరవేరనున్న పుంగనూరు ప్రజల దశాబ్దాల కల
ప్రస్తుతం 65 సర్వీసులు కేటాయింపు
పుంగనూరు – పుంగనూరు ప్రజల దశాబ్దాల కల ఆర్టీసీ డిపో ను మే 6వ తేదీన వర్చువల్ విధానంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. మంత్రి రామ‌చంద్రారెడ్డి పీఏ మునితుకారాం ఆధ్వర్యంలో వైకాపా కార్యదర్శి పెద్దిరెడ్డి ,డిపో మేనేజర్ సుదాకరయ్య,స్థానిక నాయకులతో కలిసి నూతన ఆర్టీసీ డిపోను పరిశీలించి ఏర్పాట్ల పై అధికారులతో కలిసి చర్చించారు. .మే 6వ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో డిపోను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ప్రస్తుతం డిపోకు 65 సర్వీసులను కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.హైదరాబాద్, విజయవాడ,బెంగుళూరు,చెన్నై నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు సైతం సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐ.ప్రసాద్ బాబు,ఎస్సై ఉమామహేశ్వరరావు,గ్రామ అభివృద్ధి మండలి అధ్యక్షులు అక్కిసాని భాస్కర్ రెడ్డి,మునిసిపల్ చైర్మన్ అలీం భాష,ఏఎంసి చైర్మన్ నాగరాజా రెడ్డి,మునిసిపల్ మాజీ ఛైర్మన్ కొండవీటి నాగభూషణం,మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్,ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు జయరామి రెడ్డి, జిల్లా వైసిపి కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్,కార్మిక నాయకులు మురగప్ప,యువనాయకులు రాజేష్,సురేష్,కార్మిక నాయకులు కరీముల్లా,చంద్ర తతితరలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement