Friday, November 22, 2024

తిరుమల క్షేత్రంపై విషప్రచారం అర్థరహితం.. పోకల అశోక్ కుమార్

తిరుపతి సిటీ : తిరుమలలో బాగా పాడైపోయిన అద్దె గదుల స్థానంలో సుమారు రూ.119 కోట్లు వెచ్చించి ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగిందని టీటీడీ పాలకమండలి సభ్యులు గోకల అశోక్ కుమార్ అన్నారు. శనివారం బైరాగి పట్టెడలోని ఆయన నివాసం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ప్రత్యేకించి నారాయణగిరి, 1,2,3,4 రెస్ట్ హౌస్ లలో చక్కటి టైల్స్ ఫ్లోరింగ్, ఏసి లు, గీజర్లు మార్చడంతో పాటు పాత మంచాల స్థానంలో కొత్త మంచాలను, బెడ్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తాను స్వయంగా ఎస్టేట్ కమిటీ సభ్యునిగా పర్యవేక్షించి రేట్లు నిర్ణయించామన్నారు.. నాతో పాటు చాలా మంది ఎస్టేట్ కమిటీ సభ్యులు కూడా పరిశీలించడం జరిగిందని వివరించారు.

చక్కటి వసతులు సంకూర్చబడ్డ ఈ గదుల అద్దె తప్పక మార్చవలసి ఉందని, నందకం, కౌస్తుభం, పాంచ జన్యం, ఒకలు మాత రెస్ట్ హౌస్ లన్ని ఇదేవిధంగా ఆర్డినరీ రూములుగా ఉన్నవని, ఏసీ వసతితో పాటు చక్కటి మంచాలు ఇతరత్రా మార్పులు గదులలో చేపట్టడం జరిగిందని వివరించారు. ఇదేమి అధికం మాత్రం కాదు, సాధారణ భక్తులకు ఇచ్చే 50, 100 రూపాయల అద్దె అలాగే ఉన్నాయన్నారు. తిరుమల క్షేత్రంలో ఏ చిన్న విషయమైనా భూతద్దంలో చూపెట్టడమే కాకుండా విష ప్రచారం చేస్తున్న పత్రికలు, విమర్శకులకు తాను ఒకటే విజ్ఞప్తి చేయదలచుకున్నానన్నారు. మీరంతా వాస్తవాలను గ్రహించాలన్నారు. ఇదివరకు టీటీడీ కంటే ఈరోజు అన్ని విషయాలు పారదర్శకంగా జరుగుతున్నప్పటికీ హర్షించాల్సింది పోయి అవాస్తవాలు వ్రాస్తుండడం బాధాకరమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement