తిరుపతి సిటీ : ఏ ఒక్కరికి పెన్షన్ తొలగించేది లేదని కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష తెలిపారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ శిరీష మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి అందేలా చేస్తున్నారని వివరించారు. సీఎం బాటలోనే ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అర్హులైన వారికి అందరికీ సంక్షేమ పథకాలు వారి ఇంటి వద్దకే అందేలా చేస్తున్నారని తెలియజేశారు. నగరంలో 102 సచివాలయం పరిధిలో ఆరు నెలలకు ఒక్కసారి. రీ వెరిఫికేషన్ పేరుతో పెన్షన్ విచారించడం జరుగుతున్నదని వివరించారు. దీనిపై ఎటువంటి అపోహలు చావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడం జరుగుతుందని తెలిపారు. అలాగే 90 రోజులకు కొత్త పెన్షన్లతోపాటు ఇళ్ల పట్టాలు అందేలా ముఖ్యమంత్రి చర్యలు చేపట్టడం జరుగుతున్నదన్నారు. ఈనెల ఒకటో తేదీన అదనంగా 700 కొత్త పెన్షన్లు కూడా అందజేయడం జరుగుతున్నది అన్నారు. ఒకవేళ కరెంటు బిల్లు, ఇంటి పన్ను ఏదైనా తేడా ఉంటే వాటిని కూడా అధికారులు పంపించి వాటిని విచారించి సరి చేయడం జరుగుతున్నది అన్నారు. అనంతరం డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయాంలో అర్హులైన వారు పెన్షన్ తీసుకుంటూ చనిపోతే ఆ తర్వాత అర్హులైన వారిని గుర్తించి పెన్షన్ ఇచ్చే వారిని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి వారి ఇంటి వద్దకే వచ్చి టెన్షన్ ఇస్తున్నారని తెలియజేశారు. పే న్షన్ దారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయా కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్లు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడం జరుగుతుందని ఎటువంటి ఆందోళన చెందవద్దని తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు. శేఖర్ రెడ్డి. లడ్డు భాస్కర్ రెడ్డి. ఆదం రాధారెడ్డి. ముని రామిరెడ్డి.ఎస్ . కే .బాబు. హనుమంతు నాయక్. ఆంజనేయులు. నరేంద్ర. ఈశ్వరి. కార్పొరేటర్లు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement