Friday, November 22, 2024

శ్రీకాళహస్తీశ్వరుడికి భక్తులు కరవు….

శ్రీకాళహస్తీశ్వర ఆలయం – కరోనా మహమ్మారి రెండో దఫా ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ ప్రభావం చూపిస్తున్న పరిస్థితి శ్రీకాళహస్తి పట్టణంలో నెలకొని ఉంది గతంలో కరోనా వైరస్ వస్తే పదిహేను రోజులు వైద్య పరీక్షలు చేసుకునేవారు రెండో దఫా ఎఫెక్ట్తో భయంతో మరణించిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి గత రెండు రోజుల క్రితం సీనియర్ పాత్రికేయుడు సతీమణి కరోనా ఎఫెక్ట్ తో మరణించిన సంఘటన అందరినీ ఆశ్చర్యం కలిగిస్తుంది. వైరస్ ప్రభావం తో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది
మంగళవారం ఉదయం నుంచి ఆలయంలో ఎటు చూసిన గోపురాల వద్ద భక్తులు లేక వెలవెలబోయాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ చర్యలు తీసుకుంటున్న వైరస్ ప్రభావం మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతుంది పట్టణానికి సమీపంలోని పలు ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రజలు పట్టణానికి విచ్చేస్తారు అయితే కనీస అవగాహన లేకుండా రావడంతో వైరస్ ప్రభావం పట్టణంలో అధికంగా పడుతుందని స్థానికులు వాపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం కచ్చితమైన నిబంధనలు అమలు చేయాలని అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్న ప్రజల్లో మాత్రం అవగాహన లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు అని ఇలాగే కొనసాగితే పట్టణంలో మరెంతోమంది మరణించే సంఘటనలు వస్తాయని ఇకనైనా అవసరమైతే తప్ప పట్టణానికి రావద్దని వచ్చిన వారు తప్పనిసరిగా మాస్క్ నీ వినియోగించాలని కోరుతున్నారు. చిత్తూరు జిల్లాలో తిరుమల తర్వాత శ్రీకాళహస్తి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు స్థానికంగా ఉన్న గ్రామీణ ప్రజలు వైరస్ పట్ల అవగాహన కలిగి ఉండాలని కోరుతున్నారు. ఇప్పటికే శ్రీకాళహస్తి మండలం లో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement