తిరుమల – ఈ నెల 21 నుండి 30 వ తారీఖు వరకు ఆన్లైన్లో రూ. 300 టికెట్ బుక్ చేసుకున్న భక్తులు కోవిడ్ కారణంగా రాలేని పరిస్థితుల్లో ఉన్నవారు 90 రోజుల లోపు వారు దర్శన అవకాశాన్ని వినియోగించు కోవచ్చని టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. గత కొన్ని రోజుల నుండి దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరిగిన నేపథ్యంలో టీటీడీ కొన్ని నిర్ణయాలను తిరిగి అమలు లోనికి తీసుకు వచ్చింది. ఇప్పటికే తిరుపతిలో సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లను జారీని నిలిపి వేసింది. దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడే భక్తులను తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాల్సి గా విజ్ఞప్తి చేసింది శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిద్ నియమాలను అనుసరించాల్సిoదిగా టీటీడీ సూచించింది. కాగా కొవిడ్ కారణంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతున్నది..
Advertisement
తాజా వార్తలు
Advertisement