తిరుపతి సిటీ : నవరత్నాలతో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరినట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. గురువారం 13వ డివిజన్ కార్పొరేటర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు.. ఎమ్మెల్యే.. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అమలు తీరుపై ఆరా తీశారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై లబ్ధిదారులకు ఎమ్మెల్యే అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఉపాధి లేక ఇళ్లకే పరిమితమై ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్థికంగా ఆదుకుందన్నారు. అందరికీ సంక్షేమమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ధ్యేయమన్నారు..
జగనన్న సంపూర్ణ పోషణ. అమ్మ ఒడి. విద్య దీవెన. వసిద్ధి దీవెన పింఛన్లు ఇలా ఏదో రకంగా రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరుతుందన్నారు.. మిగిలిన అర్హులను గుర్తించి వారికి సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించడానికి ప్రభుత్వ పథకాలు తెలియజేయడానికి నేరుగా గడపగడపకు వస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడేళ్లలో సంక్షేమ పథకాలు ద్వారా ఎన్నో కుటుంబాలు రూ. లక్ష నుండి పది లక్షల వరకు లబ్ధి పొందుతున్నట్లు చెప్పారు… ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ డాక్టర్ శిరీష.. డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ.. కార్పొరేటర్ లు. ఎస్ కే బాబు.. రామస్వామి వెంకటేశ్వర్లు.. వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…