Friday, November 22, 2024

వైసిపి ఎంపిలు రోబోలు – తిరుపతిలో నారా లోకేష్

‌తిరుపతి, : సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి 28 మంది రోబోలను తయారు చేసి పంపార‌ని, అందులో 22 రోబోలు లోక్‌సభలో, 6 రోబోలు రాజ్యసభలో తిరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. తిరుపతి లోక్ స‌భ ఉప ఎన్నిక‌ల‌లో భాగంగా టిడిపి అభ్య‌ర్ధి ప‌న‌బాక ల‌క్ష్మీకి మ‌ద్ద‌తుగా ఆయన ర్యాలీ, రోడ్ షోల‌తో ప్ర‌చారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తిరుపతి పార్లమెంటు- అధ్యక్షులు నరసింహ యాదవ్‌, ముఖ్య నేతలు బాబు దేవనారాయణ రెడ్డి సూర్య సుధాకర్‌ రెడ్డి, పుష్పవతి యాదవ్‌ , రాయలసీమ మీడియా కోఆర్డినేటర్‌ శ్రీధర్‌ వర్మ, అనిమినీ రవి నాయుడు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా లోకేష్‌ మాట్లాడు తూ, జగన్‌మోహన్‌రెడ్డి పంపిన రోబోలకు రెండే పనులు మోడీ కనపడితే కాళ్ళ మీద పడటం, బీజేపీ ఏ బిల్లు తెచ్చినా కనీసం బిల్లు లో ఏముందో చూడకుండా ఎస్‌ అనడం అని ఎద్దేవా చేశారు . పార్లమెంట్‌ లో ప్రత్యేక హోదా,విశాఖ ఉక్కు కోసం పోరాడుతుంది ఒక్క టిడిపి ఎంపీలు మాత్రమేనని చెప్పారు. వైకాపా ప్రభుత్వంకి కొత్త పేరు పెట్టామని, జేసిబి ప్రభుత్వమని, జ అంటే జే ట్యాక్స్‌, సి అంటే కరప్షన్‌, బి అంటే బాదుడేబాదుడు అని విమర్శించారు. నిత్యావసర సరు కులు,రేషన్‌ సరుకులు, ఇసుక, సిమెంట్‌, విద్యుత్‌, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్ను…ఆఖరికి చెత్త జగ న్‌ బ్రాండ్‌ లిక్కర్‌ ధరలు కూడా పెంచేసాడన్నారు. ఇసుకను ఇష్టానుసారం దోచేస్తున్నారని తెలిపారు. మద్యపాన నిషేధం అని సొల్లు కబుర్లు చెప్పి నకిలీ మద్యం అమ్ముతున్నారని విమర్శించారు. మహిళలకు కుడి చేత్తో 10ఇచ్చి ఎడమ చేత్తో 100 రూపాయలు కొట్టేస్తున్నాడని తెలిపారు. బద్వేల్‌ ఎమ్మె ల్యే వెంకట సుబయ్య దళిత నేత చనిపోతే అక్కడికి వెళ్లి శవం పక్కన నిలబడి నవ్వుతు న్నార‌ని పేర్కొన్నారు. చిత్తూరులో మంత్రి పెద్ది రెడ్డి అవినీతి ప్రశ్నిం చినందుకు దళిత మెజిస్ట్రేట్‌ రామకృష్ణ ని వెంటాడి వేధిస్తున్నారన్నారు. తిరుపతి వెంక న్న ఆస్తులు కూడా అమ్మాలని చూస్తున్నారని అన్నారు. ఆఖరి కి భక్తులకి శ్రీవారి లడ్డు దొరకడం లేదని, శ్రీవారి ప్రసాదాన్ని రాజకీయం కోసం అమ్మేస్తున్న దుర్మార్గులు వైకాపా వాళ్ళు అని విమర్శించారు.
టిడిపి హయాంలో రాయలసీమని ఎలెక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ హబ్‌ గా మార్చామ‌ని,.ఫ్యాక్స్‌ కాన్‌ ,సెల్‌ కాన్‌,డిక్షన్‌,రిలయన్స్‌ జియో ,టిసిఎల్‌,అపోలో -టైర్స్‌,హీరో మోటార్స్‌ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజు సరిపోదన్నారు . టిడిపిని గెలిపిస్తే ప్రజల పై జగన్‌ మోపిన పన్నుల భారం తగ్గుతుందని చెప్పారు. తిరుపతి పార్లమెంట్‌ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement