Saturday, November 23, 2024

అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు

  • పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్బరామయ్య వెల్లడి
  • సర్పంచుల సమర శంఖారావం అడ్డుకున్న పోలీసులు

తిరుపతి సిటీ : తమ సమస్యలు పరిష్కారం కోసం మంగళవారం 10 గంటలకు అలిపిరి గరుడ వలయం వద్ద సర్పంచుల సమర శంఖారావం పిలుపు ఇవ్వడం జరిగింది. దీంతో పోలీసులు ముందస్తుగా నగరంలో 30 యాక్ట్ అమల్లో ఉందని ఎక్కడ గాని సభలో సమావేశాలు ఏర్పాటు చేయరాదని ప్రకటన విడుదల చేస్తూ నాయకులను ఎక్కడకక్కడ హౌస్ అరెస్ట్ చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగంశెట్టి సుబ్బరామయ్య ను మంగళవారం అలిపిరి పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అలాగే తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి నాయుడును అరెస్టు చేశారు. అలాగే నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులను ఎక్కడకక్కడ హౌస్ అరెస్ట్ చేపట్టడంతో పాటు కార్యక్రమాన్ని జరగకుండా నిలుపుదల చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా సుబ్రమణ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 14, 15ల ఆర్థిక సంఘం నిధులను వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దారి మళ్లించడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,900 గ్రామ పంచాయతీల సర్పంచుల అనుమతి లేకుండా వారి ఖాతాలో నుంచి రాత్రికి రాత్రే డ్రా చేయడం సిగ్గుమాలిన తనం అన్నారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకి వెళ్లి శ్రీవారిని ఆలయం వద్దకు చేరుకునే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకతీతంగా సర్పంచులు వెయ్యి మందికి పైగా హాజరయ్యే కార్యక్రమాన్ని అడ్డుకోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం అరెస్టులు తో ఉద్యమాల ఆపలేదని ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయని తెలియజేశారు. ఇంకనైనా ప్రభుత్వం సర్పంచ్ హక్కులను నిధులను కాల రాసే విధానాన్ని మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు .లేని పక్షంలో పెద్ద ఎత్తున దశలవారీగా ఆందోళన తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement