తిరుపతి సిటీ : మైనర్లకు వాహనాలు ఇస్తే శిక్షార్హులు వాహనదారులలేనని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్ప నాయుడు తెలిపారు. ఇటీవల పట్టుబడిన 100 మంది మైనర్లు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ప్రమాదాలకు గురైన పిల్లలను పోగొట్టుకుని కడుపుకోత మిగిలించుకోవద్దని తెలిపారు. ఓకే కుమారుడు ఉన్న తల్లిదండ్రులు ఎంత మంది ఉన్నారని తెలియజేయాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమతో పాటు క్రమశిక్షణ కలిగి ఉండాలని వివరించారు. మైనర్లు ఓకే ద్విచక్రవాహనంపై ముగ్గురు కూడా వాహనంలో వెళ్తున్నారని ఇలా వెళ్లడం వల్ల ప్రమాదాలకు గురై వికలాంగులుగా తయారవుతారని వివరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం సరికాదన్నారు. అలాగే వారికి ఖరీదైన వాహనాలు కూడా తల్లిదండ్రులు కొనుగోలు చేసి ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. కొంతమంది మైనర్లు వ్యసనాలకు బానిసై ప్రమాదాలకు గురవుతున్నారు వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..