Friday, November 22, 2024

తిరుమ‌ల‌లో మ‌రిన్ని పార్కింగ్ స్థ‌లాలు అభివృద్ధి – టిటిడి ఈవో…

తిరుమల: శ్రీవారి దర్శనానికి విచ్చేసే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం మరిన్ని పార్కింగ్ స్థలాలను తిరుమలలో అభివృద్ధి చేయనున్నామ‌ని టిటిడి ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ప్ర‌క‌టించారు.. నేడు అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, సివిఎస్వో గోసినాథ్ జెట్టితో కలిసి తిరుమలలోని పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ యాత్రికులు గదులు తీసుకున్న పరిసరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేస్తే వారికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం తిరుమలలో నాలుగు వేల‌ వాహనాలకు పార్కింగ్ సదుపాయం ఉందని, అదనంగా మరో మూడు వేల‌ వాహనాలకు పార్కింగ్ కల్పించేందుకు టిటిడి చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. మల్టీలెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయడానికి ముల్లగుంట, సేవాసదన్ పక్కన స్థలాలు అనుకూలంగా ఉంటాయన్నారు. అదేవిధంగా యాత్రికులకు టైం స్లాట్ టికెట్లపై పూర్తి అవగాహన ఉన్నందున పీఏసీ – 5 బదులు మల్టీలెవల్ కార్ పార్కింగ్ నిర్మిస్తున్నామన్నారు. తిరుమలలో ఆర్‌టిసి బస్సులు ఎక్కవ అయినందున ప్రస్తుతం ఉన్న గ్యారేజ్‌ బదులు బాలాజీనగర్ సమీపంలోని ఖాళీ స్థలాన్ని అభివృద్ధి చేసి అక్కడ ఆర్‌టిసి గ్యారేజ్ నిర్మించనున్నట్టు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement