Friday, November 1, 2024

TTD | రేపే తిరుమలకు మోడీ.. భారీ ఎత్తున భద్రతా చర్యలు

తిరుపతి, ప్రభ న్యూస్‌ బ్యూరో :తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిండిగల్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం సాయంత్రం 6.50కి తిరుపతి విమానాశ్రయానికి రానున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుని శ్రీ రచన అతిథి గృహంలో బస చేస్తారు. 27వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం 9.30 గంటల వరకూ తిరుమలలోనే గడపనున్నారు. 10:30 గంటలకు తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేటకు చేరుకుంటారు.

బారీ భద్రత ఏర్పాటు..

ప్రధాని రెండు రోజుల పర్యటన కోసం తిరుమలకు వస్తున్న సందర్భంగా తిరుపతి, తిరుమలలో భారీ ఎత్తున పోలీస్‌ బలగాలు మోహరించారు. కేంద్రం నుంచి పారా మిలిటరీ దళాలు తిరుపతికి చేరుకున్నాయి. ఇప్పటికే రేణిగుంట విమానాశ్రయం, ఘాట్‌రోడ్లు జల్లెడ పడుతున్నాయి. తిరుమల అడవుల్లో సైతం కూంబింగ్‌ జరుపుతున్నారు. కేంద్ర బలగాలతో పాటు-, ఇంటలిజెన్స్‌, నిఘా వర్గాలు విమానాశ్రయం, తిరుమలను అదుపులోకి తీసుకుని భద్రత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే కలెక్టర్‌ వెంకట్రమణారెడ్డి, ఎస్‌పి పరమేశ్వరరెడ్డి ప్రధాని భద్రతపై పలుసార్లు అధికారులతో సమావేశాలు నిర్వహించి ముందస్తు ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement