తిరుపతి సిటీ, ఏప్రిల్ 1 (ప్రభ న్యూస్): తిరుపతి జిల్లా పరిధిలో మొబైల్ పోగొట్టుకున్న వారికోసం ప్రత్యేకంగా పోలీస్ వాట్సాప్ నెంబర్ 9490617873. ఈ నెంబర్ వాట్సాప్ కు వచ్చిన ఫిర్యాదులపై సత్ఫలితాలు వస్తున్నాయని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ ల్యాబ్ నిపుణులు మొబైల్ అంట ద్వారా వచ్చిన ఫిర్యాదును వెంటనే దర్యాప్తు చేసి సెల్ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు నాలుగు విడతలుగా సుమారు లక్ష ఇరవై నాలుగు వేల 50000 రూపాయలు టెలిఫోన్లను అందజేయడం జరిగిందని వివరించారు. నాలుగో విడత రికవరీ చేసిన 45,00,000 విలువ గల 250 మొబైల్ ఫోన్లను ఈరోజు అందజేయడం జరుగుతున్నదని వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తిరుపతి జిల్లా పోలీసులు అతి తక్కువ సమయంలోనే వివిధ రాష్ట్రాల నుండి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. వాటి విలువ రూ.1,19,00,000 రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగిందన్నారు. సైబర్ క్రైమ్ టీం పోలీసులు మొబైల్ ట్రాకింగ్ పై బాగా పనిచేస్తున్నారన్నారు. మొబైల్ మిస్సింగ్ గురించి ప్రజలు పోలీస్ స్టేషన్ వెళ్లడంపై అసౌకర్యం ఉందని ఫీడ్ బ్యాక్ రావడంతో రాష్ట్ర డీజీపీ ఆదేశాలపై సులువుతరమైన పద్ధతిలో వాట్సాప్ నెంబర్ 9490617873 ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సెల్ఫోన్ పోగొట్టుకున్నా.. దొంగతనం జరిగినా వారు పోలీస్ వాట్సప్ సర్వీస్ వాడుకోవాలని కోరారు. నగరంలో ఉన్న ప్రధాన కొరియర్ సర్వీస్ కేంద్రాలు బాధితులకు ఉచితంగా అందించడానికి ముందుకు వచ్చారన్నారు. మొబైల్ రికవరీ నందు ఉత్తమ ప్రతిభ కనబరిచిన సైబర్ ల్యాబ్ సిఐ రామచంద్ర రెడ్డి ని అభినందించి ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ వెంకట్రావు, లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పి కులశేఖర్, క్రైమ్ అదనపు ఎస్పీ విమల కుమారి, సైబర్ క్రైమ్ ల్యాబ్ సిఐ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.