Tuesday, November 26, 2024

తిరుమలలో ఏపీ మంత్రుల హల్‌చల్.. భక్తుల ఆగ్రహం

తిరుమలలో శుక్రవారం ఉదయం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శ్రీవారిని దర్శించుకోవడం వివాదాస్పదంగా మారింది. ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను విధించడంతో పాటు తిరుమలలో భక్తులకు సర్వదర్శనాన్ని రద్దు చేసింది. అయితే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిబంధనలను ఉల్లంఘించి తన 67 మంది అనుచరులతో ప్రోటోకాల్ ప్రకారం దర్శనం చేసుకోవడంపై భక్తులు మండిపడుతున్నారు.

ఇటీవల మంత్రి గుమ్మనూరు జయరాం, అంతకుముందు మంత్రి వేణుగోపాలకృష్ణ కూడా ఇలాగే తన అనుచరులతో దర్శనం చేసుకున్నారని.. తిరుమలలో శ్రీవారి ఆలయం మంత్రుల అడ్డాగా మారిపోయిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ విషయంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ.. అనుచరులతో శ్రీవారిని దర్శనం చేసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. కోవిడ్ కేసులు తగ్గేవరకు తిరుమలో సర్వదర్శనం ఉండదని ఆయన స్పష్టం చేశారు.

ఈ వార్త కూడా చదవండి: వైరల్ అయిన ఆడియోపై మంత్రి అవంతి వివరణ

Advertisement

తాజా వార్తలు

Advertisement