Friday, November 22, 2024

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా

తిరుపతిలో పుట్టిన నాకు శ్రీనివాసుడి ఆశీస్సులతో మంత్రిగా అవకాశం దక్కింద‌ని, రాష్ట్రం అంతా నా వంతు పర్యటించి ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నా మంత్రి ఆర్‌.కే.రోజా అన్నారు. జ‌గనన్న ఆశీస్సులుతో రెండు సార్లు గెలిచి ప్రజల్లో ఉండి ప్రజల కష్టాలు తెలుసుకుని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామ‌న్నారు. జగన్న కోరుకున్న విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు తీయించాలని స్వామి వారిని కోరాను. వరదలు అయ్యిన తరువాత చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి వ‌రద రాజకీయాలు చేస్తున్నార‌ని అందరికి తెలుసు అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమం అందించడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడు.. రాష్ట్రాన్ని అప్పుల్లో‌ ముంచి, చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు ప్రజల డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఎంజాయ్ చేశార‌న్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వాగ్దానం చేశాడో, ఆ మాట ప్రకారం క్యాలెండర్‌ ఇచ్చి ఆ తేదీల ప్రకారం పూర్తి చేశార‌న్నారు. ఎన్ని అవరోధాలు, కష్టాలు ఎదురైనా పేద వారి సంక్షేమమే ప్రధమ ధ్యేయంగా జగన్న పని చేస్తున్నారు. గోదావరి వరదల్లో ప్రజలందరికీ రెండు వేల రూపాయలు అందించాం అని గుర్తు చేశారు. పోలవరం కట్టకుండానే బస్సు వేసి రాష్ట్ర నలుమూలల నుండి టీడీపీ నాయకులను తీసుకెళ్ళి జయము జయము చంద్రన్న అంటూ భజన చేయించారు.. పోలవరం దగ్గరకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కి కట్టడం చేత కాదు దిగి పోమ్మనండీ నేను కడుతాను అంటున్నారు. చంద్రబాబు ఇంత వరకూ సీఎం కాలేదని అనుకుంటున్నాడేమో.. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు పోలవరంను కట్టకుండా గాడిదలు కాస్తున్నావా చంద్రబాబు అంటూ మండిప‌డ్డారు.


రాష్ట్రం విభజన తరువాత కూడా సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు పోలవరంను పూర్తి చేయలేక చేతగానీ తనంను ప్రదర్శించారన్నారు. డబ్బుల పిచ్చితో కేంద్రంను ఓ ప్యాకేజీపై తన స్వలాభం కోసం పోలవరంను ఓ ఏటిఏం కార్డులాగా వాడుకున్నారు.. చంద్రబాబు చేసిన పాపానికి రాష్ట్ర ప్రజలు నష్ట పోతున్నారు.. ఆర్ అండ్ ఫ్యాకేజీ రావాల్సిన మండలాలు అన్ని ఇబ్బంది పడుతుంది అంటే కేవలం చంద్రబాబే కారణ‌మే అన్నారు. జగన్న కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 20 వేల కోట్లు ఉన్న ఆర్ అండ్ ప్యాకేజీ కోసం విన్నపాలు తెలియజేస్తున్నారు. తాను ముఖ్యమంత్రి అయితే ముప్పు మండలాలు అన్ని ఓ జిల్లాగా చేస్తాను అని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం. కుప్పంను మున్సిపాలిటీ చేసుకోలేక పోయావు, రెవెన్యూ డివిజన్ చేసుకోలేక పోయావు.. మళ్ళీ చంద్రబాబు సీఎం అయితే రాష్ట్రాన్ని అమ్మెస్తాడు అని మంత్రి రోజా మండిప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement